twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 200 కోట్ల దిశగా... దుమ్మురేపున్న కలెక్షన్స్, మరో రెండు వారాలు ఢోకాలేదు!

    |

    అజిత్ నటించిన తమిళ చిత్రం 'విశ్వాసం' జనవరి 10న విడుదలై ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రానికి థియేటర్ల విషయంలో రజనీకాంత్ మూవీ 'పేట' నుంచి తీవ్ర కాంపిటీషన్ ఎదురైన, ఆశించిన స్థాయిలో స్క్రీన్లు దొరక్కపోయినా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది.

    ఇటీవలే ఈ చిత్రం కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు రీచ్ అయింది. త్వరలోనే రూ. 200 కోట్లను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమాకు ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుండటంపై థియేటర్ ఓనర్లు సంతోషంగా ఉన్నారని, మరో రెండు వారాల పాటు సినిమాను హ్యాపీగా రన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    బి, సి సెంటర్ల్ నుంచి...

    బి, సి సెంటర్ల్ నుంచి...

    సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్ జోడించి రూపొందించారు. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తమిళనాడుతో పాటు కర్నాటక, యూఎస్ఏ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

    ఓవర్సీస్ మార్కెట్లో సైతం..

    ఓవర్సీస్ మార్కెట్లో సైతం..

    ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చిత్రం మలేషియాలో మూడు వారాలు పూర్తయ్యే సమయానికి రూ. 10.37 కోట్ల రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లో పేట దుమ్ము రేపుతున్నప్పటికీ... యూఎస్ఏలో విశ్వాసం మంచి ఫలితాలు రాబడుతోంది.

    అజిత్ కెరీర్లో ది బెస్ట్ మాస్ మూవీ

    అజిత్ కెరీర్లో ది బెస్ట్ మాస్ మూవీ

    ఇప్పటి వరకు వచ్చిన అజిత్ సంక్రాంతి సినిమాల్లో ‘విశ్వాసం' ది బెస్ట్ మాస్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా తమిళనాడు రూరల్ బ్యాక్ డ్రాపుతో ఈ చిత్రం ఉండటంతో సినిమాకు మరింత ప్లస్ అయింది. అజిత్ మాస్ ఇమేజ్ మరింత పెరిగింది.

    అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్

    అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్

    సినిమా గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెటింగ్ అంశాలను చర్చిస్తూ రూపొందించడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో అజిత్, నయనతార, బేబీ అంకిత, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    Thala Ajith's recently-released flick Viswasam crossed the Rs 180-crore mark at the box office worldwide and is now inching towards the Rs 200-crore mark. Trade reports suggest that theatre owners are happy with the way the film is performing and are willing to continue the film for another two weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X