Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది... 4 రోజుల్లో రూ. 75 కోట్ల కలెక్షన్!
అజిత్ హీరోగా రూపొందిన 'విశ్వాసం' చిత్రం తమిళనాడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. జనవరి 10న విడుదలైన ఈ మాస్ ఎంటర్టెనర్ ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఒక్క తమిళనాడులోనే రూ. 50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 75 కోట్ల మార్కును రీచ్ అయింది.
తమిళనాడులో 500లకుపైగా స్క్రీన్లలో విడుదలైన సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తొలి రోజు రూ. 15.1 కోట్లు రాబట్టింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో గుడ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయి బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం మొదలైంది.
ఓపెనింగ్స్ అదుర్స్, రెండో రోజు అందుకే తగ్గింది
తొలి రోజు తమిళనాడు వ్యాప్తంగా అభిమానుల కోసం ఎర్లీమార్నింగ్ స్పెషల్ షోలు వేయడంతో వసూళ్ల పరంగా కలిసొచ్చింది. అయితే రెండో రోజు ఎర్లీమార్నింగ్ షోలు ఏమీ లేక పోవడంతో రూ. 10.04 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో రూ. 25.5 కోట్లు రాబట్టింది.
సంక్రాంతి హాలిడేస్ మరింత బూస్ట్
అయితే 3వ రోజు వసూళ్లలో మంచి గ్రోత్ కనిపించింది. రూ. 12.6 కోట్లు వసూలు చేసింది. శనివారం నుంచి సంక్రాంతి హాలిడేస్ మొదలు కావడంతో సినిమా కలెక్షన్లకు మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.
తమిళనాడులో దుమ్మురేపుతోంది
ఆదివారం వసూళ్ల పర్సంటేజ్ మరింత పెరగడంతో రూ. 13.1 కోట్లు వసూలు చేసింది. దీంతో 4 రోజుల తమిళనాడు టోటల్ కలెక్షన్ రూ. 51.2 కోట్లకు చేరుకుంది. ఒక్క చెన్నై సిటీలోనే రూ. 3.83 కోట్లు రాబట్టడం విశేషం.
ఇతర రాష్ట్రాల్లో...
అజిత్‌కు కర్నాటకలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ అక్కడ రూ. 5.3 కోట్లు వసూలు చేసింది. కేరళలో రూ. 2.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్లో
ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. గల్ప్ కంట్రీస్, మలేషియా, ఫ్రాన్స్ దేశాలతో పాటు యూకె, యూఎస్ఏలో ఈ చిత్రం విడుదలైంది. ఓవర్సీస్ మార్కెట్లో ఫస్ట్ వీకెండ్ రూ. 15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో 4 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ రూ. 75.25 కోట్లకు చేరుకుంది.