Vrushakarma Business: వృషకర్మ రికార్డు స్థాయి బిజినెస్.. నాగ చైతన్య మూవీకి ఎన్నో కోట్లంటే?

Vrushakarma Business: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) 'తండేల్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. తొలిసారిగా రూ.100 కోట్ల మార్క్ కు క్రాస్ చేశారు. ఈ జోష్ లో విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో వృషకర్మ (Vrushakarma) సినిమాను లైన్ లో పెట్టారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, రిలీజ్‌కు ముందే ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది. తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

వృషకర్మ సినిమాలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజువల్స్‌కు డీఓపీ రాహుల్ డి హెరియన్ పని చేయగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. మిథాలజికల్ ఫాంటసీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. 'వృషకర్మ' సినిమాను సుమారు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

Vrushakarma Pre Release Business Naga Chaitanya s Pan-India Film Creates Buzz with 53 Crore Deal

గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు
ఇటీవల విడుదల చేసిన 'వృషకర్మ' ఫస్ట్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంది. కేవలం కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సాధించి సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇందులో నాగచైతన్య ఒక నిధి అన్వేషకుడిగా కనిపించగా, ఇంటెన్స్ లుక్‌లో ఆయన కనిపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దుష్ట శక్తులకు ఎదురొడ్డి పోరాడే యోధుడిలా చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. వృషకర్మ నాగచైతన్య కెరీర్‌లోనే మొదటి పాన్-ఇండియా సినిమా కావడం విశేషం.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'వృషకర్మ' సినిమా థియేట్రికల్ హక్కులకు ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైనర్స్ (Sithara Entertainments) అధినేత నాగవంశీ సుమారు రూ.45 కోట్లకు కైవసం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఓవర్సీస్ నాన్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం.

ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు అమ్ముడయ్యాయని సోషల్ మీడియాలో ప్రకారం జరుగుతోంది. ఇలా మొత్తంగా తెలుగు థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.53 కోట్ల వరకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌గా భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ వేసవిలో లేదా జూలై ప్రాంతంలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తం చూస్తే.. 'తండేల్' తర్వాత నాగచైతన్య కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా 'వృషకర్మ' నిలవనుంది. భారీ బడ్జెట్, విభిన్న కథ, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, అలాగే విడుదలకు ముందే వచ్చిన భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X