RGV's Vyooham Collections అత్యంత దారుణంగా వ్యూహం కలెక్షన్లు.. ఆర్ఝీవి మూవీకి ఎన్ని లక్షలంటే?

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్వకత్వం, నిర్మాణంలో రూపొందిన చిత్రం వ్యూహం. శ్రీ రామదూత క్రియేషన్స్, ఆర్జీవి డెన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరాం, ఎలీనా తుటేజా తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్టించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహజనిత, కల్పిత సన్నివేశాలను జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. పక్కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో సన్నివేశాలను తీర్చిదిద్దారు.

Vyooham Movie Day 1 Expected Collections Worldwide RGV disaster at Box Office

ఇక వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ముందస్తు అనుకొన్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ పెరిగింది. సినిమాకు సంబంధించిన ఖర్చులు, కోర్టు ఖర్చులు అదనంగా మారాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 25 కోట్ల రూపాయలు అని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడం గమనార్హం. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది లేకపోయింది.

వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రిలీజ్ చేశారు. సుమారుగా ఈ సినిమాను 600 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక పరిమితంగా కర్ణాటకలో, అలాగే ఓవర్సీస్‌లో ఓ మోస్తారుగా ఈ సినిమాను రిలీజ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో భిన్నమైన టాక్ నమోదైంది.

Vyooham Movie Day 1 Expected Collections Worldwide RGV disaster at Box Office

వ్యూహం సినిమాకు తొలి రోజు దారుణమైన ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజే కొన్ని చోట్ల ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెల బోయాయి. అంతేకాకుండా నిర్ణీత సంఖ్యలో టికెట్లు తెగపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తున్నది. దాంతో తొలి రోజు దారుణంగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి.

ఇక వ్యూహం సినిమాకు తొలి రోజు పేలవమైన కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రాంగోపాల్ వర్మ తీసిన ఆఫీసర్ సినిమా మాదిరిగానే ఈ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X