Waltair Veerayya's Day 6 Collections: పండగ ముగిసినా వీరయ్య కలెక్షన్స్ తగ్గలేదు.. లాభాల్లోకి అడుగు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ మరొక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పండగ తర్వాత కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మొత్తంగా 6వ రోజు ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి? ఇక ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే ఇంకా ఎంత రావాలి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

వాల్తేరు వీరయ్య విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమా రేంజ్ కు తగ్గట్టుగా రెండు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది. నైజాం ఏపీలో కలిపి 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 9 కోట్లు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 88 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

6వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్


వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 6వ రోజు ఏపీ తెలంగాణలో 7.33 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. తగ్గిపోయాయి. ఇక నైజాం లో మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటాడు. మిగిలిన ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి ఆక్యుపెన్సి నమోదు చేసింది.

ఏపీ తెలంగాణ 6 డేస్ కలెక్షన్స్

ఏపీ తెలంగాణ 6 డేస్ కలెక్షన్స్

ఇక మూడు రోజుల్లో వాల్తేరు వీరయ్య వీరయ్య ప్రపంచవ్యాప్తంగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజం ఏరియాలో 24.47 కోట్లు, సీడెడ్ లో 14.61 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.9 కోట్లు, ఈస్టులో 7.55 కోట్లు, వెస్టులో 4.25 కోట్లు, గుంటూరులో 5.95 కోట్లు, కృష్ణ లో 5.58 కోట్లు, నెల్లూరులో 2.81 కోట్లు వచ్చాయి. ఇక మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాకు 75.01 కోట్ల షేర్ కలెక్షన్స్, 91.80 కోట్ల గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్


6వ రోజు ఇండియా మొత్తంగా ఈ సినిమా 9 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.90 కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్ లో 10.50 కోట్లను అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 91.41 కోట్లు వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక గ్రాస్ కలెక్షన్స్ అయితే 157.95 కోట్లు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మరోసారి సెంచరీ కొట్టడంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.

 యూఎస్ లో 2 మిలియన్స్

యూఎస్ లో 2 మిలియన్స్

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా 2 మిలియన్ల డాలర్స్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలతో రికార్డును అందుకోగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా అదే తరహాలో 2 మిలియన్ మార్క్ అనుకోవడం విశేషం.

లాభాల్లో వీరయ్య

లాభాల్లో వీరయ్య

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొత్తంగా 88 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి రాగా.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 91 కోట్లకు పైగా షేర్ అందుకుంది. ఇక సినిమా మొత్తానికి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ఇప్పటివరకు 2.41 కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X