వాల్తేరు వీరయ్య vs, వీర సింహారెడ్డి.. ఒకే సస్థకు రెండు సినిమాల నైజాం హక్కులు.. బిగ్ డీల్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంక్రాంతికి రాబోయే సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు రెండు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఇక వీరిలో ఎవరు అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిసారి కూడా సంక్రాంతి బరిలో బాలయ్య మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఫైట్ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఇక ఈసారి కూడా అంతకు మించి అనేలా బజ్ అయితే క్రియేట్ అవుతోంది.
ఇక రెండు సినిమాలు కూడా ప్రతి ఏరియాలలో పోటాపోటీగా బిజినెస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక నైజం ఏరియాలోనే ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కాబట్టి ఈ బాక్స్ ఆఫీస్ క్యాష్ పై నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది కూడా వైరల్ గా మారుతుంది. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాల నైజాం ఏరియా హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ కు అమ్మడం చర్చనీయాంశంగా మారింది.

వాల్తేరు వీరయ్య అలాగే వీరసింహారెడ్డి రెండు కలిపి నైజం ఏరియాకు 35 కోట్లకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు విక్రయించినట్లు తెలుస్తోంది అయితే ఇదే సంస్థలో మళ్లీ అమ్మడం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. కాకపోతే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రం వేరే వాళ్ళని తెలుస్తోంది. పలువురు మైత్రి మూవీ మేకర్స్ లోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ స్థాయిలో రెండు సినిమాలు బిజినెస్ చేయడం ఆసక్తిగా మారింది. మిగతా ఏరియాలో కూడా నిర్మాతలు భారీ ధరలకు అమ్మినట్లుగా తెలుస్తోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య వర్సెస్ మెగాస్టార్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











