Waltair Veerayya Pre Release Business.. బాక్సాఫీస్ రికార్డుల మోతకు రెడీ.. చిరంజీవి మూవీ లాభాలకు రావాలంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ అంచనాలతో జనవరి 13వ తేదీన అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ధమాకాతో భారీ విజయాన్ని అందుకొన్న మాస్ మహారాజ్ రవితేజ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.

మెగా ఫ్యాన్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నది. అందాల భామ శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ట్రెండ్ సెట్ చేశాయి. ఇలాంటి అంచనాలతో వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో భారీ బిజినెస్

టాలీవుడ్‌లో భారీ బిజినెస్

వాల్తేరు వీరయ్యకు ముందు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను తప్పింది. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. అయినా ఈ సినిమా బిజినెస్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇండస్ట్రీలో భారీ బిజినెస్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

88 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్

88 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్

వాల్తేరు వీరయ్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి బిజినెస్ నమోదు చేసింది. ఈ చిత్రం దాదాపు 88 కోట్ల రూపాయలను థియేట్రికల్ బిజినెస్ రూపంలో సాధించింది. చిరంజీవి కెరీర్‌లో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే..

ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో అత్యధికంగా 18 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత సీడెడ్‌లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.5 కోట్ల రూపాయాల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అమ్మడయ్యాయి. ఈ సినిమా హక్కులు ఈ మూడు ప్రాంతాల్లో హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఆంధ్రాలో ఏ రేంజ్‌లో అంటే

ఆంధ్రాలో ఏ రేంజ్‌లో అంటే

ఇక ఆంధ్రా ప్రాంతంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా హక్కులు 7.5 కోట్ల మేర, ఈస్ట్ గోదావరి జిల్లా 6.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 6 కోట్లు, కృష్ణా జిల్లా 5.8 కోట్లు, నెల్లూరు జిల్లా 3.2 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 72.5 కోట్ల మేర బిజినెస్ రాబట్టింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో బిజినెస్

కర్ణాటక, ఓవర్సీస్‌లో బిజినెస్

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా వాల్తేరు వీరయ్య బిజినెస్ బ్రహ్మండంగా, క్రేజీగా జరిగింది. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులు 6.5 కోట్లుగా అమ్మడయ్యాయి. ఓవర్సీస్‌లో 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 88 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది.

వాల్తేరు వీరయ్య లాభాల్లోకి రావాలంటే?

వాల్తేరు వీరయ్య లాభాల్లోకి రావాలంటే?

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను పరిశీలిస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం కనీసం 90 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ధారించాయి. ఈ సినిమా 90 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్ట గలిగితే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ వసూళ్ల, లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X