Waltair Veerayya Closing Collections వాల్తేరు వీరయ్య 89 కోట్ల టార్గెట్.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో దర్శకుడు బాబీ రూపొందించిన వాల్తేరు వీరయ్య చిత్రం థియేట్రికల్ రన్‌ను దాదాపు ముగించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎర్నేని నవీన్, రవి ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. గత 46 రోజులకుపైగా కలెక్షన్ల మోత మోగిస్తూ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. అయితే వాల్తేరు వీరయ్య క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్
వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం ఏరియా హక్కులను 18 కోట్లకు, సీడెడ్ 15 కోట్లకు, ఉత్తరాంధ్రలో 10 కోట్లకుపైగా, ఈస్ట్ గోదావరి 6.5 కోట్లు, పశ్చిమ గోదావరి 6 కోట్లు, గుంటూరు జిల్లా థియేట్రికల్ హక్కులు 7.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.6 కోట్లు, నెల్లూరు జిల్లా 3.2 కోట్లు మేర అమ్ముడయ్యాయి.
దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు 72 కోట్లకుపైగా నమోదుయ్యాయి. ఇక కర్ణాటక హక్కులు 5 కోట్లకు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 9 కోట్లకు అమ్ముడయ్యాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్ల మేర జరిగింది.

ఆల్ టైమ్ టాప్ 6 జాబితాలో
వాల్తేరు వీరయ్య చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో 89 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. మౌత్ టాక్‌తో పాజిటివ్‌గా మారి, పండగ సీజన్ కావడంతో కలెక్షన్ల కుంభవృష్టిని సాధించింది. చిరంజీవి కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆల్ టైమ్ 6వ చిత్రంగా నిలిచింది. 2023లో విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా రికార్డును నమోదు చేసుకొన్నది.

46 రోజుల తర్వాత ఓటీటీలోకి
వాల్తేరు వీరయ్య చిత్రం దాదాపు 46 రోజులుగా థియేట్రికల్ రన్‌ను కొనసాగించింది. తాజాగా అంటే ఫిబ్రవరి 27వ తేదీన ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఓటీటీలో కూడా భారీ స్పందన లభించే అవకాశం కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో లాభం ఎంతంటే?
వాల్తేరు వీరయ్య గత 46 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 34.5 కోట్లకు, సీడెడ్‌లో 17.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.6 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.5 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 6.3 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.8 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 72 కోట్ల బిజినెస్ గాను.. 108 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 36 కోట్ల లాభాలను పంచిపెట్టింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో కలెక్షన్లు
వాల్తేరు వీరయ్య తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే .. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్, ఓవర్సీస్‌లో 28.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 215 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. విడుదలైన ప్రతీ చోట లాభాలను పంచి పెట్టడం ఇటీవల కాలంలో వాల్తేరు వీరయ్యకే దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత లాభమంటే?
ప్రపంచవ్యాప్తంగా లాభాల విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య ఇండియా వైడ్‌గా 187 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 28.5 కోట్ల గ్రాస్ సాధించింది. దాంతో ఈ చిత్రం 215 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 89 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు దాదాపు 70 కోట్ల మేర లాభాలను పంచిపెట్టింది.


Click it and Unblock the Notifications











