Waltair Veerayay 5 day collections చిరంజీవి కలెక్షన్ల సునామీ.. అన్నీ చోట్ల హౌస్‌పుల్స్‌తో స్వైర విహారం
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వరద పారిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట వసూళ్ల ప్రవాహం కొనసాగుతున్నది. రవితేజ, శృతిహాసన్ తదితరులు నటించిన సినిమా బాక్సాఫీస్ జోరు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రోజు రోజుకు హౌస్‌ఫుల్ బోర్డులతో సినిమా థియేటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలా రికార్డుల జోష్ కొనసాగిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం 5వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

4 రోజుల్లో భారీ కలెక్షన్లు
వాల్తేరు వీరయ్య చిత్రం గత నాలుగు రోజుల్లో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఏపీ, తెలంగాణలో విజృంభిస్తున్న ఈ చిత్రం 59 కోట్ల షేర్, 96 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం 74 కోట్ల షేర్, 128 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చిరంజీవి కెరీర్‌లో వేగంగా 100 కోట్ల క్లబ్ దాటిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

150 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌గా
వాల్తేరు వీరయ్య చిత్రం తొలివారం ముగిసే సమయానికి 150 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం ఖాయమైంది. మంగళవారం ఈ అరుదైన రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ముందు తెలుగు రాష్ట్రాల్లో వీరయ్య టార్గెట్ 150 కోట్లుగా మారే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో రికార్డుల పరంపర
వాల్తేరు వీరయ్య ఒవర్సీస్‌లో భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం సుమారు 20 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం రికార్డు. ఇదే జోష్ కొనసాగితే.. ఈ చిత్రం 4 మిలియన్ డాలర్లు సునాయసంగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

5వ రోజు ఆక్యుపెన్సీ
వాల్తేరు వీరయ్య సినిమా 5వ రోజు బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 44 శాతం, బెంగళూరులో 25 శాతం, చెన్నైలో 78 శాతం, విజయవాడ 69 శాతం, వరంగల్‌లో 35 శాతం, గుంటూరులో 74 శాతం, వైజాగ్‌లో 89 శాతం, కరీంనగర్‌లో 82 శాతం, కాకినాడలో 98 శాతం, నెల్లూరులో 92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

5వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
వాల్తేరు వీరయ్య 6వ రోజు ఆక్యుపెన్సీ, కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ పరిశీలిస్తే.. మరోసారి భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 13 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్‌లో ఈ చిత్రం మరో 1 కోటి రూపాయలు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. దాంతో ఈ చిత్రం 5వ రోజున కూడా రికార్డు కలెక్షన్లను నమోదు చేయడం ఖాయమైంది.


Click it and Unblock the Notifications











