Don't Miss!
- News
కన్నీటి పర్యంతమైన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Waltair Veerayya Day1 collections వాల్తేరు వీరయ్యకు రికార్డు ఓపెనింగ్స్.. బాక్సాఫీస్‌ను ఎంత కొల్లగొట్టాడంటే?
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రవితేజ, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చితాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే ఈ సినిమా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత ఉందనే వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు, హిందీ వెర్షన్లలో విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం 18 కోట్లు, సీడెడ్‌లో 15 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6.5 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 6 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.6 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.2 కోట్లుతో మొత్తంగా 72 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో మిగితా రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 9 కోట్ల మేర బిజినెస్ చోటు చేసుకొన్నది. దాంతో మొత్తంగా ఈ సినిమా 88 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 90 కోట్ల వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

వాల్తేరు వీరయ్య ఆక్యుపెన్సీ
తెలుగు వెర్షన్ వాల్తేరు వీరయ్య ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 73 శాతం, బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 52 శాతం, విజయవాడలో 97 శాతం, వరంగల్‌లో 85 శాతం, గుంటూరులో 96 శాతం, వైజాగ్‌లో 97 శాతం, నిజమాబాద్‌లో 62 శాతం, కరీంనగర్‌లో 62 శాతం, కాకినాడలో 97 వాతం, నెల్లూరులో 91 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

హిందీలో ప్రభావం చూపని
వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. పెద్దగా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది. ముంబైలో అత్యధికంగా రెస్పాన్స్ లభించింది. ముంబైలో 51 శాతం ఆక్యుపెన్సీ, ఢిల్లీలో 10 శాతం, కోల్‌కతాలో 14 శాతం, ఆహ్మదాబాద్, సూరత్‌లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు ఇలా..
వాల్తేరు
వీరయ్య
ఓవర్సీస్
కలెక్షన్ల
వివరాల్లోకి
వెళితే..
అమెరికాలో
ప్రీమియర్ల
ద్వారా
సుమారు
500K
వసూళ్లను
సాధించింది.
ఇక
తొలి
రోజు
327
లోకేషన్లలో
738
షోల
ద్వారా
122K
అమెరికా
డాలర్లు
వసూలు
చేసింది.
దాంతో
ఈ
చిత్రం
ప్రీమియర్లు,
ఫస్ట్
డే
కలిపి
622K
వసూళ్లను
సాధించింది.
ఇక
ఆస్ట్రేలియాలో
62
షోల
కోసం
860
టికెట్లు
అమ్ముడుపోయాయి.
యూకేలో
తొలి
రోజు
అడ్వాన్స్
బుకింగ్
ద్వారా
48
లక్షలు
వసూలు
చేసింది.

దక్షిణాదిలో కలెక్షన్లు
వాల్తేరు వీరయ్య బెంగళూరులో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 37 లక్షలు సాధించింది. తమిళనాడులో 10 లక్షలు వసూలు చేసింది. హిందీలో 10 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణలో వసూళ్లు
ఇక తెలంగాణలో వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 3.44 కోట్లు, మిగితా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 1.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో మొత్తం 7 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రాలో 25 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టిన ఈ చిత్రం 15 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల అంచనా ఎంతంటే?
వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న వసూళ్లను పరిశీలిస్తే.. ఇండియాలో ఈ చిత్రం 28 కోట్ల షేర్, ఇక ఓవర్సీస్‌లో మొత్తంగా 5 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో ఈ చిత్రం 33 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. 90 కోట్ల బ్రేక్ ఈవెన్‌లో 33 శాతం రికవరీ సాధించే అవకాశం ఉంది.