Don't Miss!
- News
టీడీపీలోకి కడప జిల్లా మాజీ మంత్రి..!?
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Waltair Veerayya 6 day collections 150 కోట్ల వాల్లేరు వీరయ్య.. చిరంజీవి మూవీకి ఎంత లాభమంటే?
సంక్రాంతి పండుగ బరిలో దిగిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ కలెక్షన్లకు చిరునామాగా మారారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ చిరంజీవి నటించిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. విడుదలై తొలి వారం ముగిసినా భారీ వసూళ్లతో హోరెత్తిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు కుమ్మేసింది. ఇక ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తొలి రోజు ఏపీ, నైజాంలో కలిపి 30 కోట్లు, రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 20 కోట్లు, నాలుగో రోజు 17 కోట్లు, ఐదో రోజు 13 కోట్లతో దాదాపు 110 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత వేగంగా 100 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఓవర్సీస్‌లో 20 కోట్లు
ఇక
ఓవర్సీస్
విషయానికి
వస్తే..
గత
ఐదు
రోజుల్లో
అమెరికాలో
14
కోట్లకుపైగా,
ఆస్ట్రేలియాలో
1.25
కోట్లు,
న్యూజిలాండ్‌లో
9
లక్షలు,
యూకేలో
1.29
కోట్లు,
యూఏఈలో
1
కోటి,
మిగితా
దేశాల్లో
52
లక్షల
రూపాయలు
వసూలుచేసింది.
అలాగే
కెనడా,
సింగపూర్,
యూరప్‌లో
1
కోటి
వసూళ్లను
రాబట్టింది.
ఓవర్సీస్‌లో
దాదాపు
20
కోట్ల
రూపాయలను
కొల్లగొట్టింది.

వాల్తేరు వీరయ్య 6వ రోజు ఆక్యుపెన్సీ
గత
ఐదు
రోజులుగా
కలెక్షన్ల
జోరు
ప్రదర్శిస్తున్న
వాల్తేరు
వీరయ్య
6వ
రోజు
వర్కింగ్
డే
రోజు
కూడా
భారీగా
ఆక్యుపెన్సీ
నమోదు
చేసింది.
హైదరాబాద్‌లో
30
శాతం,
చెన్నైలో
45
శాతం,
విజయవాడలో
41
శాతం,
వరంగల్‌లో
24
శాతం,
గుంటూరులో
51
శాతం,
కరీంనగర్‌లో
70
శాతం,
కాకినాడలో
92
శాతం,
నెల్లూరులో
81
శాతం
వసూళ్లను
సాధించింది.

6వ రోజు వీరయ్య వీరంగం
ఇక
వాల్తేరు
వీరయ్య
సినిమా
6వ
రోజు
కలెక్షన్ల
అంచనా
విషయానికి
వస్తే..
భారీగానే
వసూళ్లు
నమోదయ్యాయి.
ఈ
చిత్రం
6వ
రోజున
దాదాపు
10
కోట్ల
కలెక్షన్లను
ఏపీ,
తెలంగాణ,
కర్ణాటకలో
రాబట్టే
అవకాశం
ఉంది.
అలాగే
ఓవర్సీస్‌లో
223
లోకేషన్లలో
36
లక్షల
రూపాయలు
వసూలు
చేసే
ఛాన్స్
ఉంది.
దాంతో
ఈ
సినిమా
దాదాపు
11
కోట్ల
రూపాయలు
వసూలు
చేస్తుందని
ట్రేడ్
వర్గాలు
వెల్లడిస్తున్నాయి.

ఆరో రోజు లాభాల్లోకి వీరయ్య
వాల్తేరు
వీరయ్య
చిత్రం
విడుదలకు
ముందు
భారీగా
బిజినెస్
చేసింది.
వరల్డ్
వైడ్‌గా
ఈ
సినిమా
ప్రీ
రీలీజ్
బిజినెస్
88
కోట్ల
మేరకు
చేసింది.
దాంతో
ఈ
సినిమా
కనీసం
90
కోట్లు
రాబడితే..
బ్రేక్
ఈవెన్
అవుతుంది.
గత
ఐదు
రోజు్లో
ఈ
సినిమా
84
కోట్ల
షేర్,
145
కోట్ల
గ్రాస్
వసూళ్లను
రాబట్టింది.
6వ
రోజు
కలిపితే..
ప్రపంచవ్యాప్తంగా
బ్రేక్
ఈవెన్
సాధించినట్టు
అవుతుంది.