twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya: చిరంజీవి మూవీకి షాకింగ్ బిజినెస్.. ఆ చిత్రాల కంటే తక్కువే.. బాలయ్య రికార్డు బ్రేక్

    |

    దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతోన్నారు బాస్ మెగాస్టార్ చిరంజీవి. తనలోని అన్ని కోణాలను చూపిస్తూ ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఇక, రీఎంట్రీలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో వస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ జరిగింది అనే వివరాలను చూసేద్దాం పదండి!

    వాల్తేరు వీరయ్యగా చిరంజీవి

    వాల్తేరు వీరయ్యగా చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా వస్తున్న ఎంటర్‌టైనర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా చేశారు.

    Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!

    అలాంటి కథ... మాస్ ట్రీట్

    అలాంటి కథ... మాస్ ట్రీట్

    వాల్తేరు పట్టణంలో మాఫియా డాన్‌గా హవాను చూపిస్తోన్న వీరయ్య ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటాడు. అతడిని ఎదుర్కొనేందుకు పోలీస్ వ్యవస్థ కూడా విఫలం అవుతుంది. అప్పుడే ఏసీపీ విక్రమ్ సాగర్ ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి వీళ్ల మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది అనే కథాంశంతో 'వాల్తేరు వీరయ్య' తెరకెక్కింది. ఇందులో ఫుల్ లెంగ్త్ మాస్ ట్రీట్ ఉండబోతుంది.

    గ్రాండ్ రిలీజ్.. సందడిగానే

    గ్రాండ్ రిలీజ్.. సందడిగానే

    బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. విడుదలకు నెల ముందు నుంచే ఈ చిత్రం హవా కనిపిస్తోంది.

    Golden Globe Awards: RRR పెను సంచలనం.. నాటు నాటు సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్.. ఏషియాలోనే తొలిసారిGolden Globe Awards: RRR పెను సంచలనం.. నాటు నాటు సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్.. ఏషియాలోనే తొలిసారి

    హక్కులకు భారీ డిమాండ్

    హక్కులకు భారీ డిమాండ్

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల టాక్.

    ఏపీ, తెలంగాణలో బిజినెస్

    ఏపీ, తెలంగాణలో బిజినెస్

    'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6 కోట్లు, గుంటూరులో రూ. 7.50 కోట్లు, కృష్ణాలో రూ. 5.60 కోట్లు, నెల్లూరులో రూ. 3.20 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 72.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

    రవితేజ, చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక హక్కులు రూ. 5 కోట్లకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే రూ. 89 కోట్లు వస్తేనే ఈ సినిమా విజయాన్ని సాధిస్తుంది.

    బాలయ్య రికార్డ్ బ్రేక్.. కానీ

    బాలయ్య రికార్డ్ బ్రేక్.. కానీ

    'వాల్తేరు వీరయ్య' సినిమాకు రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం బాలయ్య 'వీర సింహా రెడ్డి' రూ. 73 కోట్లు బిజినెస్ రికార్డును బ్రేక్ చేసింది. అయితే, ఇది చిరంజీవి గత చిత్రాలను మాత్రం దాటలేదు. ఆయన కెరీర్‌లో సైరాకు రూ. 187.25 కోట్లు బిజినెస్ జరగ్గా.. ఆచార్యకు రూ. 131.20 కోట్లు, గాడ్ ఫాదర్‌కు రూ. 91 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

    నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఆయన కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది. గతంలో 'అఖండ' మూవీకి రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి ఏకంగా రూ. 20 కోట్లు వ్యాపారం పెరిగింది.

    English summary
    Chiranjeevi and Ravi Teja Did Waltair Veerayya Movie Under K. S. Ravindra Direction.Lets Know This Movie Pre Release Business Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X