twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అంచనాలను మించి కలెక్షన్లు సాధిస్తున్నది. జనవరి 13వ తేదీన రిలీజైన ఈ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించి భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే 250 కోట్లకు చేరువైన ఈ చిత్రం 18వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను నమోదు చేసింది. అయితే గతవారం కలెక్షన్లను పోల్చి చూస్తే.. భారీగానే క్షీణించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత 18 రోజుల వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    మూడో వారంలో కూడా నిలకడగా

    మూడో వారంలో కూడా నిలకడగా

    వాల్తేరు వీరయ్య చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలకు భిన్నంగా తొలి రోజు నుంచే వసూళ్లను రాబట్టింది. తొలి రోజు సుమారు 30 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తొలివారాంతంలో రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇక రెండోవారం ముగిసే సమయానికి 33 కోట్లతో, మూడో వారంలో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.

    18వ రోజు ఆక్యుపెన్సీ

    18వ రోజు ఆక్యుపెన్సీ


    ఇక వాల్తేరు వీరయ్య 18వ రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో 36 శాతం, బెంగళూరులో 30 శాతం, చెన్నైలో 22 శాతం, వరంగల్‌లో 21 శాతం, గుంటూరుులో 28 శాతం, వైజాగ్‌లో 36 శాతం, కాకినాడలో 23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

    18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    వాల్తేరు వీరయ్య 18వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 21 లక్షలు, సీడెడ్‌లో 9 లక్షలు, ఉత్తరాంధ్రలో 6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరులో 4 లక్షలు, క‌ృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరులో 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 1.25 కోట్లు గ్రాస్, 70 లక్షల షేర్ నమోదు చేసింది.

    18 రోజుల ఓవరాల్ కలెక్షన్లు

    18 రోజుల ఓవరాల్ కలెక్షన్లు


    వాల్తేరు వీరయ్య ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో గత 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 19 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 13 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, క‌ృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 115 కోట్లు షేర్, 183 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా ఎంత మేర కలెక్షన్లు అంటే

    ప్రపంచవ్యాప్తంగా ఎంత మేర కలెక్షన్లు అంటే

    వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణ, హిందీ వెర్షన్, కన్నడ, ఇతర రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 158 కోట్లు రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో 8 కోట్లకుపైగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో అన్ని దేశాల్లో కలిపి మొత్తంగా 28 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

    వాల్తేరు వీరయ్యకు ఎన్ని కోట్ల లాభమంటే?

    వాల్తేరు వీరయ్యకు ఎన్ని కోట్ల లాభమంటే?


    ఇక వాల్తేరు వీరయ్య సాధించిన లాభాల విషయానికి వస్తే.. ఈ చిత్రం 89 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. 18వ రోజు కలెక్షన్ల పరిశీలిస్తే.. ఈ చిత్రం దాదాపు 45 కోట్ల లాభాన్ని డిస్టిబ్యూటర్లకు పంచిపెట్టింది. ఇంకా ఈ సినిమా భారీ లాభాలను షేర్ చేసే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Chiranjeevi's Waltair Veerayya going good at box office. This movie hits the Screens on January 13th. In this occassion, Movie Unit organised Waltair Veerayya Mega Mass Blockbuster Meet. Here is the Day 18 collections details worldwide of Waltair Veerayya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X