Waltair Veerayya's 19 Days Collections కలెక్షన్ల జోష్ తగ్గిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి మూవీపై ఆ సినిమా దెబ్బ!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టిని గత రెండు వారాలుగా కురిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. గత 18 రోజుల్లో 220 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం మూడో వారంలో వసూళ్లపరంగా నెమ్మదించింది. వాల్తేరు వీరయ్య చిత్రం 19వ రోజున సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలివారంలో 150 కోట్లు
వాల్తేరు వీరయ్య తొలి రోజు నుంచే అనూహ్యమైన ఫలితాలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. తొలి రోజు రికార్డు స్థాయిలో 30 కోట్లు ఇండియాలో, 8 కోట్లకుపైగా ఓవర్సీస్‌లో రాబట్టింది. ఇక తొలి వారం ముగిసే సమయానికి 120 కోట్లు ఇండియాలో, ఓవర్సీస్‌లో 16 కోట్లకుపైగా రాబట్టింది. దాంతో ఈ చిత్రం 150 కోట్లకు చేరువగా కలెక్షన్లను నమోదు చేసింది.

రెండోవారంలో 200 కోట్లకు చేరువగా
వాల్తేరు వీరయ్య రెండో వారం విషయానికి వస్తే.. భారీగానే కలెక్షన్లను నమోదు చేసింది. రెండో వారంలో తెలుగులో 33 కోట్లు, హిందీలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

గత 18 రోజుల్లో కలెక్షన్లు ఇలా..
వాల్తేరు వీరయ్య గత 18 రోజుల్లో.. తెలుగు రాష్ట్రాల్లో 182 కోట్ల గ్రాస్, 113 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 8.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లో 17 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 140 కోట్లు షేర్, 230 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం 40 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసింది.

19వ రోజు ఆక్యుపెన్సీ
ఇక వాల్తేరు వీరయ్య 19వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 35 శాతం, బెంగళూరులో 30 శాతం, చెన్నైలో 21 శాతం, వరంగల్‌లో 32 శాతం, గుంటూరులో 28 శాతం, వైజాగ్‌లో 37 శాతం, కాకినాడలో 20 శాతం ఆక్యుపెన్సీతో సరిపెట్టుకొన్నది.

19వ రోజు నిలకడగా వాల్తేరు వీరయ్య
ఇక 19వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మూడో మంగళవారం రోజున 1.25 కోట్ల గ్రాస్.. 80 లక్షల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 183 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. నంద్యాల, ఖమ్మం లాంటి బీ గ్రేడ్ పట్టణాల్లో భారీగా వసూళ్లను సాధించింది. నంద్యాలలో 69 లక్షల షేర్, ఖమ్మంలో 1.10 కోట్ల షేర్ నమోదు చేసింది. మిగితా ప్రాంతాల్లో వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది.

వాల్తేరు వీరయ్యకు పఠాన్ దెబ్బ
వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్లకు షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం కళ్లెం వేసిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. పఠాన్ తెలుగు వెర్షన్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన కనిపిస్తున్నది. ముఖ్యంగా నైజాంలో మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. దాంతో వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్లపై దెబ్బ పడిందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











