WaltairVeerayya's first week Collections:200 కోట్ల టార్గెట్. బాక్సాఫీస్‌పై వీరయ్య వీరంగం..వారం రోజుల్లో ఎంతంటే

వాల్తేరు వీరయ్య చిత్రం హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. హాలీడే, వర్కింగ్ డే అనే తేడా లేకుండా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఆచార్య డిజాస్టర్‌తో చిరంజీవి ఖేల్ ఖతం అనుకొనే వారికి మెగాస్టార్ గట్టిగా సమాధానం చెప్పే విధంగా కలెక్షన్లు రుజువు చేశాయి. బాక్సాఫీస్ వద్ద నిలకడగానే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. వాల్తేరు వీరయ్య సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

గత ఆరు రోజుల్లో వీరయ్య వీరంగం

గత ఆరు రోజుల్లో వీరయ్య వీరంగం

వాల్తేరు వీరయ్య సినిమా గత 6 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఏపీ, తెలంగాణలో 75 కోట్ల షేర్, 121 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్లు, ఓవర్సీస్‌లో 14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల షేర్, 160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7వ రోజు స్ట్రాంగ్‌గా

7వ రోజు స్ట్రాంగ్‌గా

ఇక 7వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. 7వ రోజు కూడా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 31 శాతం, బెంగళూరులో 22 శాతం, చెన్నైలో 26 శాతం, విజయవాడలో 23 శాతం, గుంటూరులో 33 శాతం, వైజాగ్‌లో 60 శాతం, కరీంనగర్‌లో 70 శాతం, కాకినాడలో 75 శాతం, నెల్లూరులో 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

హిందీ వెర్షన్ డిజాస్టర్‌గా

హిందీ వెర్షన్ డిజాస్టర్‌గా


ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఉత్తరాది భారతంలో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముంబై, ఢిల్లీ, సూరత్, పూణే ప్రాంతంలో పేలవంగా ఆక్యుపెన్సీ కనిపించింది. అయితే బెంగళూరు, కోల్ కతా, జైపూర్‌లో భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే కలెక్షన్ల విషయంలో పూర్తిగా డిజాస్టర్‌గా వసూళ్లు సాధించింది.

అమెరికాలో సరికొత్త రికార్డు

అమెరికాలో సరికొత్త రికార్డు

అలాగే వాల్తేరు వీరయ్య ఓవర్సీస్‌లో మరో రికార్డు క్రియేట్ చేసింది. 2023లో అమెరికాలో 2 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన ఇండియన్ ఫిల్మ్‌గా ఘనతను సాధించింది. గత వారంలో ఈ చిత్రం 17 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా అమెరికాలోనే కాకుండా పలు దేశాల్లో భారీగా వసూళ్లను రాబడుతుండటం విశేషంగా మారింది.

7వ రోజు ఏపీ, తెలంగాణలో

7వ రోజు ఏపీ, తెలంగాణలో

ఇక ఏడో రోజు వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ యాత్ర ఘనంగా సాగింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో భారీ వసూళ్లు సాధించింది. హైదరాబాద్ ఎక్స్ రోడ్‌లో 4 లక్షల వసూలు చేసింది. మొత్తంగా 1 కోటి రూపాయల మార్కును దాటింది. తాడేపల్లిగూడెంలో 5 లక్షల గ్రాస్ సాధించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వారం రోజుల్లో 50 లక్షలు రాబట్టింది. ఖమ్మంలో 7వ రోజున 5.1 లక్షలు రాబట్టింది. ఇల ప్రతీ చోట కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఏడో రోజు ఈ చిత్రం సుమారు 8.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?


వాల్తేరు వీరయ్య గత వారం రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. ఏడో రోజుల్లో ఏపీ, తెలంగాణలో సుమారు 80 కోట్ల షేర్, 128 కోట్ల గ్రాస్, అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్ల గ్రాస్, అమెరికాలలో 17 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇతర దేశాల్లో వసూళ్లు కలిపితే దాదాపు 170 కోట్ల గ్రాస్, 95 కోట్ల షేర్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు 7 కోట్లకుపైగా లాభాలను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X