Waltair Veerayya 10 Days Collections: చిరంజీవి ఊచకోత.. 10వ రోజు రికార్డులు.. అన్ని కోట్లు ఏంటి సామీ!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ జోష్‌తోనే ఆయన వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. స్పందన మాత్రం భారీ రేంజ్‌లోనే వస్తోంది. దీంతో ఈ మూవీకి రెండో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 10 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే ఓ లుక్కేయండి మరి!

వీరయ్యగా చిరంజీవి ఊరమాస్

వీరయ్యగా చిరంజీవి ఊరమాస్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ హీరో రవితేజ కాంబోలో రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు

చిరంజీవి మార్కెట్‌ ప్రకారమే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'వాల్తేరు వీరయ్య'కు 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 78 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి.. రూ. 6.66 షేర్, రూ. 11.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

10 రోజుల్లోనూ 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 31.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 14.39 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.49 కోట్లు, గుంటూరులో రూ. 7.16 కోట్లు, కృష్ణాలో రూ. 6.94 కోట్లు, నెల్లూరులో రూ. 3.65 కోట్లతో కలిపి.. రూ. 95.03 కోట్లు షేర్, రూ. 153.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 95.03 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో చిరంజీవి నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 114.13 కోట్లు షేర్‌, రూ. 195.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 114.13 కోట్లు వరకూ వచ్చాయి. అంటే దీనికి రూ. 25.13 కోట్లు వరకూ లాభాలు కూడా దక్కినట్లు తెలుస్తోంది.

టాప్ 5 చిత్రాల జాబితాలోకి ఎంట్రీ

టాప్ 5 చిత్రాల జాబితాలోకి ఎంట్రీ

చిరంజీవి, రవితేజ కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా పదో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా 10వ రోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలోకి ఇది చేరిపోయింది. అలాగే, ఎన్నో రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X