Waltair Veerayya 15 Days Collections: 15వ రోజు డౌన్.. తొలిసారి ఇంత తక్కువగా.. అయినా చిరు రికార్డులే
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్2లో హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్న ఆయన.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చారు.
క్రేజీ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మాత్రం భారీగా దక్కుతోంది. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 15 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూడండి మరి!

వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు
మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌కు అనుగుణంగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
15వ రోజు 'వాల్తేరు వీరయ్య'కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 73 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య' 15 రోజుల్లో కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 18.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.84 కోట్లు, గుంటూరులో రూ. 7.48 కోట్లు, కృష్ణాలో రూ. 7.28 కోట్లు, నెల్లూరులో రూ. 4.29 కోట్లతో కలిపి.. రూ. 104.62 కోట్లు షేర్, రూ. 169.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 104.62 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 15 రోజుల్లో చిరంజీవి నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 125.04 కోట్లు షేర్, రూ. 213.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 125.04 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 36.04 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు చేసింది. అయితే, 15వ రోజు మాత్రం ఈ చిత్రానికి చాలా తక్కువ వసూళ్లు దక్కాయి. ఇదే ఈ మూవీ ఫుల్ రన్‌లో తక్కువ మొత్తం కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











