Waltair Veerayya 16 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. చిరంజీవి మరో రికార్డు.. లాభాలతో సంచలనం

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేస్తూ వెళ్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

క్రేజీ కాంబినేషన్‌‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మాత్రం భారీగా లభిస్తూనే ఉంది. దీంతో కలెక్షన్లు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 16 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే లుక్కేయండి మరి!

వీరయ్యగా మారిపోయిన మెగాస్టార్

వీరయ్యగా మారిపోయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ప్రకారమే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'వాల్తేరు వీరయ్య'కు 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.08 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

16 రోజుల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 34.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 18.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.89 కోట్లు, గుంటూరులో రూ. 7.54 కోట్లు, కృష్ణాలో రూ. 7.34 కోట్లు, నెల్లూరులో రూ. 4.33 కోట్లతో కలిపి.. రూ. 105.70 కోట్లు షేర్, రూ. 170.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 105.70 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 16 రోజుల్లో చిరంజీవి నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 126.31 కోట్లు షేర్‌, రూ. 216 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

పూర్తి స్థాయి మాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 126.31 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 37.31 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ఆ మార్కులు చేరుకుని రికార్డులు

ఆ మార్కులు చేరుకుని రికార్డులు

టాలీవుడ్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే 16 రోజుల్లో ఇది తెలుగు రాష్ట్రాల్లో రూ. 170 కోట్ల గ్రాస్ మార్కును, ఓవరాల్‌గా రూ. 216 కోట్లు మైలురాయిని చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X