twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya 2 Weeks Collections: చిరంజీవి మరో సెంచరీ.. 14వ రోజు అన్ని కోట్లు.. లాభం చూస్తే షాకే

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నారు. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతికి ఆయన 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చారు.

    క్రేజీ కాంబినేషన్‌‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మాత్రం భారీగా దక్కుతోంది. దీంతో ఈ మూవీకి రెండో వారంలోనూ కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 2 వారాల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూసేయండి!

    వీరయ్యగా వచ్చేసిన చిరంజీవి

    వీరయ్యగా వచ్చేసిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఇక, దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

    ఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షోఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షో

    వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు

    వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు

    చిరంజీవి స్థాయికి తగ్గట్లుగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

    14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    14వ రోజు 'వాల్తేరు వీరయ్య'కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 2.11 కోట్లు షేర్, రూ. 3.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

    2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

    2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

    'వాల్తేరు వీరయ్య'కు 2 వారాల్లోనూ కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 18.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.80 కోట్లు, గుంటూరులో రూ. 7.44 కోట్లు, కృష్ణాలో రూ. 7.24 కోట్లు, నెల్లూరులో రూ. 4.26 కోట్లతో కలిపి.. రూ. 103.89 కోట్లు షేర్, రూ. 168.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, టీఎస్‌లో రికార్డు స్థాయిలో రూ. 103.89 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.68 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 వారాల్లో చిరంజీవి నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 124.27 కోట్లు షేర్‌, రూ. 212.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

    ఇద్దరు స్టార్లు కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 124.27 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35.27 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    చిరంజీవి మరో 100.. మళ్లీ రికార్డు

    చిరంజీవి మరో 100.. మళ్లీ రికార్డు

    చిరంజీవి, రవితేజ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు షేర్ మార్కునే దాటేసింది. అలాగే, రూ. 35 కోట్లు లాభాల మైలురాయినీ చేరుకుని రికార్డు సాధించింది.

    English summary
    Chiranjeevi and Ravi Teja Starrer Waltair Veerayya Movie Released January 14th Worldwide. Now This Movie Collects 124.27 Crores In 2 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X