Waltair Veerayya 22 Days Collections: బాగా పడిపోయిన వసూళ్లు.. బాహుబలి రికార్డుపై చిరంజీవి గురి
ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ మాత్రం భారీగా లభిస్తూనే ఉంది. అయితే, నాలుగో వారంలో మాత్రం దీనికి దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 22 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూడండి!

వాల్తేరు వీరయ్యగా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. రవితేజ కీలక పాత్రలను చేసిన ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ప్రకారం 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
మాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 22వ రోజైన శుక్రవారం మాత్రం దీనికి కేవలం రూ. 8 లక్షలు మాత్రమే షేర్ దక్కింది.

22 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
22 రోజుల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.13 కోట్లు, గుంటూరులో రూ. 9.05 కోట్లు, కృష్ణాలో రూ. 7.59 కోట్లు, నెల్లూరులో రూ. 4.52 కోట్లతో కలిపి.. రూ. 113.60 కోట్లు షేర్, రూ. 183.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 113.60 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.23 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 22 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 134.93 కోట్లు షేర్, రూ. 230.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లో దీనికి రూ. 134.93 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 45.93 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

బాహుబలి రికార్డుకు చేరువగా
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ. 113.60 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆంధ్రా, తెలంగాణలో 'బాహుబలి' వసూలు చేసిన రూ. 114 కోట్లు మార్కుకు చేరువగా వచ్చేసింది.


Click it and Unblock the Notifications











