Waltair Veerayya 23 Days Collections: మళ్లీ భారీ వసూళ్లు.. చిరంజీవి మరో రికార్డు.. 26 లక్షలు వస్తే!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించిన ఆయన.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ భారీగా లభించింది. దీంతో దీనికి వసూళ్లు పోటెత్తాయి. అయితే, నాలుగో వారం డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 23 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో మీరే చూడండి!

వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. రవితేజ కీలక పాత్రలను చేసిన ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు
స్టార్ హీరో చిరంజీవి మార్కెట్ ప్రకారమే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
చిరంజీవి, రవితేజ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 23వ రోజైన శనివారం కాస్త పెరిగి తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 లక్షలు షేర్ వచ్చింది.

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య' 23 రోజుల్లో కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.14 కోట్లు, గుంటూరులో రూ. 9.06 కోట్లు, కృష్ణాలో రూ. 7.61 కోట్లు, నెల్లూరులో రూ. 4.53 కోట్లతో కలిపి.. రూ. 113.74 కోట్లు షేర్, రూ. 183.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 113.74 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.11 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.23 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 23 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 135.08 కోట్లు షేర్, రూ. 230.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి, శృతి హాసన్ జంటగా చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లో దీనికి రూ. 135.08 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 46.08 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

మరో రికార్డు సాధించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఈ చిత్రం తాజాగా రూ. 135 కోట్లు షేర్ మార్కును చేరుకుంది. అలాగే, రూ. 46 కోట్లు లాభాల మైలురాయిని కూడా చేరింది. తద్వారా చిరంజీవి కెరీర్‌లోనే ఎక్కువ లాభాల చిత్రంగా ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











