Waltair Veerayya 25 Days Collections: తెలుగులో పెను సంచలనం.. బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన చిరంజీవి
టాలీవుడ్‌లో తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత ఆయనలో ఉత్సాహం రెట్టించింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే గత సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ భారీగా లభించింది. దీంతో దీనికి వసూళ్లు పోటెత్తాయి.ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 25 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దామా!

వాల్తేరు వీరయ్యగా వచ్చేశారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ప్రకారమే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

25వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
చిరంజీవి, రవితేజ హీరోలుగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 25వ రోజైన సోమవారం ఈ సినిమాకు రూ. 15 లక్షలు షేర్ వచ్చింది.

25 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
25 రోజుల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.91 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.19 కోట్లు, గుంటూరులో రూ. 9.12 కోట్లు, కృష్ణాలో రూ. 7.67 కోట్లు, నెల్లూరులో రూ. 4.58 కోట్లతో కలిపి.. రూ. 114.54 కోట్లు షేర్, రూ. 185.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలంగాణ, ఆంధ్రాలో రికార్డు స్థాయిలో రూ. 114.54 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.14 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 25 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 135.93 కోట్లు షేర్, రూ. 232.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లో దీనికి రూ. 135.93 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 46.93 కోట్లు లాభాలు దక్కాయి.

బాహుబలి రికార్డు బ్రేక్ చేసేసి
చిరంజీవి, రవితేజ కలయికలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీ తాజాగా ఆంధ్రా, తెలంగాణ కలిపి రూ. 114.54 కోట్లు రాబట్టింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ షేర్ రాబట్టిన చిత్రాల్లో 'బాహుబలి 1' రూ. 114 రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ లిస్టులో 5వ స్థానానికి చేరింది. ఇందులో RRR, బాహుబలి 2, అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ముందున్నాయి.


Click it and Unblock the Notifications











