Waltair Veerayya 26 Days Collections: చిరంజీవి ఖాతాలో మరో ఘనత.. చరణ్ రికార్డు బ్రేక్ చేసేలా!
దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీలో ఆయన మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ రెస్పాన్స్ భారీగా లభించింది. దీంతో దీనికి వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 26 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దామా!

వాల్తేరు వీరయ్యగా అరాచకం
మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌కు తగ్గట్లుగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
మాస్ హీరోల కాంబినేషన్‌లో ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 26వ రోజైన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 10 లక్షలు షేర్ వచ్చింది.

26 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య' 26 రోజుల్లో కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.91 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.19 కోట్లు, గుంటూరులో రూ. 9.13 కోట్లు, కృష్ణాలో రూ. 7.68 కోట్లు, నెల్లూరులో రూ. 4.59 కోట్లతో కలిపి.. రూ. 114.64 కోట్లు షేర్, రూ. 185.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 114.64 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 26 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.04 కోట్లు షేర్, రూ. 232.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి - బాబీ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి రూ. 136.04 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.04 కోట్లు లాభాలు దక్కాయి.

మరో ఘనత.. చరణ్ రికార్డు పైన
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ తాజాగా రూ. 136 కోట్ల షేర్ మార్కునే దాటేసింది. అలాగే, రూ. 47 కోట్ల లాభాల మైలురాయిని కూడా చేరుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీ రికార్డు (రూ. 47.52)కు కూడా చిరంజీవి సినిమా చేరువగా వచ్చేసింది.


Click it and Unblock the Notifications











