Waltair Veerayya 27 Days Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. చిరంజీవి ఆ రికార్డును చేరడం కష్టమే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన.. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్నారు. ఇక, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా దూసుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 27 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూడండి!

వాల్తేరు వీరయ్యగా మెగా హీరో

వాల్తేరు వీరయ్యగా మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా రూపొందిన చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ప్రకారమే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 27వ రోజైన బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 6 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

స్విమ్‌సూట్‌లో ప్రణిత పరువాల ప్రదర్శన: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణమా!
https://telugu.filmibeat.com/heroine/pranitha-subhash-swimming-pool-video-goes-viral-117109.html

27 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

27 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


27 రోజుల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.91 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.19 కోట్లు, గుంటూరులో రూ. 9.13 కోట్లు, కృష్ణాలో రూ. 7.69 కోట్లు, నెల్లూరులో రూ. 4.60 కోట్లతో కలిపి.. రూ. 114.70 కోట్లు షేర్, రూ. 185.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 114.70 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 27 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.11 కోట్లు షేర్‌, రూ. 232.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

చిరంజీవి హీరోగా బాబీ రూపొందించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లో దీనికి రూ. 136.11 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.11 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

ఆ రికార్డును చేరడం కష్టమేనా

ఆ రికార్డును చేరడం కష్టమేనా

చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో 'వాల్తేరు వీరయ్య' మూవీ తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీ రికార్డు (రూ. 47.52)కు చేరువగా వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రన్ కంప్లీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా ఆ రికార్డును ఇది చేరుకోవడం కష్టంగానే మారిందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X