Waltair Veerayya 29 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 175తో మరో అరాచకం.. ఈ మధ్య ఇదే రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత స్పీడుగా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దీనికి వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' మూవీకి 29 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం పదండి!

వాల్తేరు వీరయ్యగా చిరంజీవి రచ్చ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేసిన ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలివే
మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గకుండానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

29వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే, నాలుగో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే 28వ రోజు దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 లక్షలే వచ్చాయి. కానీ, 29వ రోజు మాత్రం రూ. 5 లక్షలు షేర్ దక్కింది.

29 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు 29 రోజుల్లో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.19 కోట్లు, గుంటూరులో రూ. 9.13 కోట్లు, కృష్ణాలో రూ. 7.71 కోట్లు, నెల్లూరులో రూ. 4.61 కోట్లతో కలిపి.. రూ. 114.79 కోట్లు షేర్, రూ. 185.92 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 114.79 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 29 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.20 కోట్లు షేర్, రూ. 232.82 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి - రవితేజ హీరోలుగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 29 రోజుల్లో దీనికి రూ. 136.20 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.20 కోట్లు లాభాలు దక్కాయి.

ఐదో వారంలోనూ 175తో రికార్డు
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే అన్ని చోట్లా భారీ ఆదరణను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం ఐదో వారంలోకి ఎంటరైంది. అయినప్పటికీ నైజాంలో 60 థియేటర్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 175 చోట్ల ఇది ప్రదర్శితం అవుతూ ఈ మధ్య కాలంలో బెస్ట్ మూవీగా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











