Waltair Veerayya 3 Weeks Collections: వీరయ్య అరాచకం.. 3 వారాల్లో అన్ని కోట్లా.. చిరంజీవి పెను సంచలనం

టాలీవుడ్‌లోకి ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభం నుంచే తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ మాత్రం భారీగా లభిస్తూనే ఉంది. దీంతో కలెక్షన్లు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 3 వారాల్లో ఎంత రాబట్టిందో చూడండి!

వీరయ్యగా రచ్చ చేసిన మెగాస్టార్

వీరయ్యగా రచ్చ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో తెరకెక్కిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు

మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌కు తగ్గట్లుగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 21వ రోజైన గురువారం మాత్రం దీనికి కేవలం రూ. 12 లక్షలు మాత్రమే వచ్చాయి.

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

3 వారాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.13 కోట్లు, గుంటూరులో రూ. 9.04 కోట్లు, కృష్ణాలో రూ. 7.58 కోట్లు, నెల్లూరులో రూ. 4.51 కోట్లతో కలిపి.. రూ. 113.52 కోట్లు షేర్, రూ. 183.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 113.52 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.09 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.22 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 వారాల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 134.83 కోట్లు షేర్‌, రూ. 230.02 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

మాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో దీనికి రూ. 134.83 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 45.83 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

లాభాలతో చిరంజీవి సంచలనం

లాభాలతో చిరంజీవి సంచలనం

టాలీవుడ్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ దీనికి రూ. 45 కోట్లకు పైగా లాభాలు దక్కాయి. ఇది చిరంజీవి కెరీర్‌లోనే అత్యధికం అని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X