Waltair Veerayya 31 Days Collections: 31వ సంచలనం.. ఏకంగా అన్ని లక్షలు.. మొత్తం ఎన్ని కోట్లు అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషితోనే సినిమాల్లోకి వచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగారు. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో రాకెట్ వేగంతో ప్రాజెక్టులు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చారు. దీనికి ఇప్పటికీ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 31 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

వీరయ్యగా మారిపోయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన మాస్ మసాలా చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలివే
మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌కు తగ్గకుండానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయింది.

31వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
పూర్తి స్థాయి మాస్ మసాలా కథతో రూపొందిన 'వాల్తేరు వీరయ్య'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే, 4వ వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 31వ రోజైన ఆదివారం దీనికి హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. దీంతో ఈ చిత్రం రూ. 16 లక్షలు షేర్ రాబట్టింది.

31 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
31 రోజుల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 36.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.94 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.21 కోట్లు, గుంటూరులో రూ. 9.14 కోట్లు, కృష్ణాలో రూ. 7.74 కోట్లు, నెల్లూరులో రూ. 4.63 కోట్లతో కలిపి.. రూ. 115.04 కోట్లు షేర్, రూ. 186.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 115.04 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 31 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.49 కోట్లు షేర్, రూ. 233.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 31 రోజుల్లో దీనికి రూ. 136.49 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.49 కోట్లు లాభాలు దక్కాయి.

31వ రోజు కూడా ఈ రేంజ్‌లోనా
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే అన్ని చోట్లా భారీ ఆదరణను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం ఐదో వారంలోకి ఎంటరైంది. అయినప్పటికీ దీనికి 31వ రోజు భారీ రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు, చాలా ఏరియాల్లో ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.


Click it and Unblock the Notifications











