Waltair Veerayya 33 Days Collections: చరిత్ర సృష్టించిన చిరు.. అన్ని కోట్లతో చరణ్ రికార్డు బద్దలు

టాలీవుడ్‌లో ఏకంగా నాలుగన్నర దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగొందుతూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలతో సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తోన్నారు. దీంతో నెల దాటినా ఇప్పటికీ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 33 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

వీరయ్యగా ఎంటరైన చిరంజీవి

వీరయ్యగా ఎంటరైన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబోలో రూపొందిన మాస్ మసాలా చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలివే

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలివే


మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గట్లుగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.

33వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

33వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే, 4వ వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 33వ రోజు ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 6 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

33 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

33 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

'వాల్తేరు వీరయ్య' 33 రోజుల్లో కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 36.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.21 కోట్లు, గుంటూరులో రూ. 9.14 కోట్లు, కృష్ణాలో రూ. 7.76 కోట్లు, నెల్లూరులో రూ. 4.64 కోట్లతో కలిపి.. రూ. 115.16 కోట్లు షేర్, రూ. 186.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 115.16 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 33 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.61 కోట్లు షేర్‌, రూ. 233.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?


చిరంజీవి - రవితేజ హీరోలుగా నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 33 రోజుల్లో దీనికి రూ. 136.61 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.61 కోట్లు లాభాలు దక్కాయి.

రామ్ చరణ్ రికార్డు బద్దలైంది

రామ్ చరణ్ రికార్డు బద్దలైంది


మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టడంతో రూ. 47.61 కోట్లు లాభాలు కూడా సొంతం అయిపోయాయి. దీంతో తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ రికార్డు (రూ. 47.52)ను బ్రేక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X