Waltair Veerayya 4 Weeks Collections: చిరంజీవి సంచలనం.. 4 వారాల్లో వందల కోట్లు.. చరణ్ రికార్డు సేఫ్!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న ఈ స్టార్ హీరో.. గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దీనికి వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో మీరే చూడండి!

వాల్తేరు వీరయ్యగా వచ్చిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

వీరయ్య ప్రీ బిజినెస్ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి మార్కెట్‌కు తగ్గట్లుగానే 'వాల్తేరు వీరయ్య' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ అయిది.

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
క్రేజీ కాంబోలో మాస్ మూవీగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఆరంభం నుంచే ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కుతోన్నాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలోనే 28వ రోజైన గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 4 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

4 వారాలకు కలిపి ఎంతొచ్చింది?
4 వారాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 35.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.19 కోట్లు, గుంటూరులో రూ. 9.13 కోట్లు, కృష్ణాలో రూ. 7.70 కోట్లు, నెల్లూరులో రూ. 4.60 కోట్లతో కలిపి.. రూ. 114.74 కోట్లు షేర్, రూ. 185.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 114.80 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 వారాల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.15 కోట్లు షేర్, రూ. 232.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
చిరంజీవి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 4 వారాల్లో దీనికి రూ. 136.15 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 47.15 కోట్లు లాభాలు దక్కాయి.

రామ్ చరణ్ రికార్డు మాత్రం సేఫ్
చిరంజీవి - బాబీ కలయికలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీ తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీ రికార్డు (రూ. 47.52)కు చేరువగా వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఫలితంగా ఆ రికార్డును 'వాల్తేరు వీరయ్య' చేరుకునే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications











