Walter Veerayya, Veera Simha Reddy collections.. జోరుగా వీరయ్య వసూళ్లు.. వీరసింహారెడ్డి పరిస్థితి షాకింగ్‌గా!
సంక్రాంతి పండుగ బరిలో నువ్వా నేనా అనే విధంగా దూకిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. తొలివారం జైత్రయాత్ర చేసిన ఈ రెండు చిత్రాలు రెండో వారాంతంలో కూడా భారీగానే వసూళ్లు రాబడుతున్నాయి. వీరసింహారెడ్డి 9వ రోజు, వాల్తేరు వీరయ్య 8వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

8 రోజుల్లో వాల్తేరు వీరయ్య
వాల్తేరు వీరయ్య సినిమా గత 8 రోజుల్లో భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఏపీ, నైజాంలో కలిపి 84 కోట్ల షేర్, 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల షేర్, 175 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే డిస్టిబ్యూటర్లకు 12 కోట్ల లాభాన్ని పంచిపెట్టింది.

9వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి
ఇక వాల్తేరు వీరయ్య సినిమా 9వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వీకెండ్ కావడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరులో 39 శాతం, చెన్నైలో 64 శాతం, వరంగల్‌లో 40 శాతం, వైజాగ్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 66 శాతం, కాకినాడలో 48 శాతం, నెల్లూరులో 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు కలెక్షన్ల అంచనా
ఇక వాల్తేరు వీరయ్య సినిమా తొమ్మిదో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. అలాగే ఏపీ, తెలంగాణలో 8 కోట్ల వరకు వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

9 రోజుల్లో వీరసింహారెడ్డి వసూళ్లు
ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. గత 9 రోజుల్లో వీరవిహారం చేసింది. ఏపీ, నైజాంలో 61 కోట్లు షేర్, 99 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఓవర్సీస్‌తో కలిపి 71 కోట్ల షేర్, 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు దరిదాపుల్లో ఉంది. రెండో వారాంతం తర్వాత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

10వ రోజు వీరసింహారెడ్డి కలెక్షన్లు
వీరసింహారెడ్డి 10వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 41 శాతం, బెంగళూరులో 34 శాతం, చెన్నైలో 37 శాతం, వరంగల్‌లో 50 శాతం, వైజాగ్‌లో 41 శాతం, కాకినాడలో 15 శాతం, నెల్లూరులో 28శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. విడుదలైన అన్నీ చోట్ల ఓ మోస్తారు కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 10వ రోజు వీరసింహారెడ్డి పరిస్థితి
ఇక వీరసింహారెడ్డి సినిమా 10వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 2 లక్షల గ్రాస్ వసూలు చేసింది. గత 10 రోజుల్లో 80 లక్షలకుపైగా రాబట్టింది. నైజాంలో 50 లక్షలు వసూలుచేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రా, నైజాంలో కలిపి 2 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌తో కలిపి 10వ రోజు 2.5 కోట్లు నమోదుచేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











