War 2 Andhra, Nizam Business: వార్ 2 ముందు భారీ టార్గెట్.. ఎన్ని కోట్లు వస్తే ఎన్టీఆర్ మూవీ లాభాల్లోకి అంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఇక వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్, హృతిక్ కాంబినేషన్ భారీ విజయం అందుకొన్నది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన వార్ 2పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తున్నది. ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ నేరుగా రిలీజ్ చేస్తున్నది.

తొలిసారి ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నేరుగా ప్రవేశించి వార్ 2 సినిమా చేస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా నైజాం, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ దక్కించుకొనేందుకు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్, నాగవంశీ లాంటి సంస్థలు భారీగా ప్రయత్నించాయి. అయితే గతంలో దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ.. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, నమ్మకంతో ఈ సినిమాకు భారీగా, ఫ్యాన్సీ రేటును చెల్లించి థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.
వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సుమారుగా 90 కోట్ల (అదనంగా జీఎస్టీ) కు దక్కించుకొన్నారు. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 105 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి ) అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రేంజ్‌లో నాగవంశీ క్రేజీగా రైట్స్ సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నది.
ఇక ఈ సినిమా ఏపీ, నైజాం బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నిర్మాత నాగవంశీ భారీగానే హక్కులను భారీ రేట్లకు అమ్మినట్టు తెలుస్తున్నది. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయలు, ఆంధ్రా 40 కోట్ల రూపాయలు, నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు సుమారుగా 35 కోట్ల రూపాయలు వాల్యూ కట్టారని తెలిసింది. మొత్తంగా ఈ సినిమా 93 కోట్ల రూపాయల మేర బిజినెస్‌ను వాల్యూ చేశారు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు.
కూలీ మూవీతో భారీ పోటీని ఎదుర్కొంటున్న వార్ 2 సినిమా ముందు బాక్సాఫీస్ లక్ష్యం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా హై రేంజ్‌లో ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఆంధ్రా, నైజాంలో రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రజనీకాంత్ కూలీని ఎదురించి ఈ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందా? అనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నాగవంశీ తన స్ట్రాటజీ ఎలా వర్క్ చేసి ఈ సినిమాను లాభాల్లోకి రప్పిస్తారని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











