War 2 Day 1 Box Office: తొలి రోజు రికార్డుపై గురిపెట్టిన వార్ 2.. హృతిక్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ హిస్టరీ తిరగరాస్
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ సినిమా కావడంతో పాటు తారక్, హృతిక్ రోషన్ కలిసి నటించడంతో వార్ 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్ల రికార్డులపై అందరి చూపు నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..
వార్ 2 బడ్జట్ ఎంత?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
గతంలో హృతిక్ రోషన్ నటించిన వార్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో పాటు హృతిక్- ఎన్టీఆర్ కాంబో కావడంతో వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్స్‌లో మంచి బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా వార్తలు వచ్చాయి.
వార్ 2కు రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగులో వార్ 2 థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకోవడానికి ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏషియన్ సినిమా వంటి సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ఎగబడ్డాయి. ఇందుకోసం దాదాపు 90 నుంచి 110 కోట్ల వరకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కింద ఇచ్చేందుకు సైతం ఆసక్తి చూపాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దాదాపు 80 కోట్ల రూపాయల ఫ్యాన్సీ డీల్‌తో తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 హిందీ, తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకుందని ట్రేడ్ పండితులు తెలిపారు.
అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 సంచలనం
ఇకపోతే.. అడ్వాన్స్ బుకింగ్‌లోనూ వార్ 2 దూసుకెళ్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్‌ల కూలీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ వార్ 2 ముందుస్తు బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. యూఎస్‌లో ప్రీమియర్స్ కోసం 586 లోకేషన్స్‌లో 1596 షోలకు గాను ఇప్పటి వరకు 178K (భారత కరెన్సీలో రూ.1.55 కోట్లు) వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా 10 రోజులు ఉండటంతో వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో మరింత ప్రభంజనం సృష్టించవచ్చని భావిస్తున్నారు.
ఆ రికార్డుపై హృతిక్ కన్ను
ఇదిలాఉండగా.. వార్ 2 చిత్రం ద్వారా హృతిక్ రోషన్‌ను ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. హృతిక్ హీరోగా 2019లో వచ్చిన వార్ చిత్రం తొలి రోజు 53.35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. దానిని వార్ 2 అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్, ఇతర ట్రెండ్స్‌ను బట్టి వార్ 2 తొలి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. హిందీ బెల్ట్‌లో హృతిక్ ఫాలోయింగ్‌కు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ క్రేజ్‌ను బట్టి వార్ 2 చిత్రం 100 కోట్ల రూపాయలను అలవోకగా సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











