War 2 Day 1 Box Office: వార్ 2కి రికార్డ్ ఓపెనింగ్స్.. హృతిక్, ఎన్టీఆర్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబర్ స్టార్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. హిందీ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నిర్మాణ సంస్థగా పేరొందిన యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. వార్ 2కి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో వార్ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.

వార్ 2 బడ్జెట్ ఎంత?
వార్ 2లో హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇండియా, స్పెయిన్, జర్మనీ, దుబాయ్, ఇటలీ తదితర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్స్‌లో వార్ 2 మూవీ చిత్రీకరణ జరిగింది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా నిర్మాత ఆదిత్య చోప్రా వార్ 2ను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

War 2 Day 1 Expected Box Office Collections Worldwide Hrithik Roshan and Jr NTR s film good start at GBOC

వార్ 2 బిజినెస్ ఎంత?
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించడంతో పాటు టీజర్, ట్రైలర్‌తో వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగిన విధంగానే వరల్డ్ వైడ్‌గా వార్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. వార్ 2 హిందీ వెర్షన్‌ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. దీంతో అక్కడ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు.

తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)కు కొనుగోలు చేశారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్
వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నాటి నుంచి నెమ్మదిగా ఆక్యూపై చేస్తూ వస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లకు ఓవర్సీస్‌లో ఉన్న ఫ్యాన్ బేస్‌ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకెళ్తోంది. యూఎస్ఏలో ప్రీమియర్స్ సేల్స్‌లోనూ వార్ 2 ప్రభంజనం సాగించింది. అమెరికాలో 724 లోకేషన్స్‌కు గాను 1879 షోలకు గాను 21,512 టికెట్లు అమ్ముడై అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు అక్కడ 6 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 5 కోట్ల రూపాయలు) వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల వసూళ్లను కలిపి ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

ఇక నార్త్‌లో వార్ 2 చిత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఇండియా వైడ్‌గా వార్ 2కు 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వార్ 2కి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 40 కోట్ల రూపాయలు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజు సాయంత్రం 4 గంటల వరకు హిందీ వెర్షన్‌లో 17 శాతం, తమిళంలో 28 శాతం, తెలుగులో 75 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. వార్ 2 తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయలు.. హిందీలో 40 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 20 కోట్ల రూపాయలు .. ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా తొలిరోజు 110 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X