War 2 Day 1 Collections: షాకింగ్‌గా వార్ 2 కలెక్షన్లు.. జూ ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్ల వసూళ్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
వార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ గ్రాండ్‌గా రూపొందించారు.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ 2 చిత్రానికి భారీగా భిజినెస్‌ను వాల్యూ కట్టారు. హిందీ వెర్షన్‌ను ఉత్తరాంధ్రలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు) కు కొనుగోలు చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.
వార్ చిత్రం భారీ విజయం సాధించడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ హిందీ రంగంలోకి అడుగుపెట్టడం, అలాగే హృతిక్ రోషన్ తెలుగు సినీ రంగానికి నేరుగా పరిచయం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
హృతిక్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు ఇండియాలోనే ఈ చిత్రం 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండోరోజు 24 కోట్ల రూపాయలు, మూడో రోజు 23 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 29 కోట్ల రూపాయలు, ఐదో రోజు 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 రోజుల తొలి వారాంతంలో 167 కోట్లకపైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఇండియాలో 320 కోట్ల నెట్, 375 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 471 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
వార్ 2 సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కూలీ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో తొలి రోజు 25 కోట్ల రూపాయలు, హిందీలో 35 కోట్ల రూపాయలు, 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో వసూలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 80 నుంచి 85 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వార్ చిత్రం సాధించిన తొలి రోజు కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











