War 2 Day 13 Collectons: వార్ 2కి నష్టాలు తప్పాలంటే.. ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? 13వ రోజు కలెక్షన్ ఎంత?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఓ మాదిరిగా వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం 2వ వారంలో ఆసక్తికరంగా కలెక్షన్స్ అందుకుంటోంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళంలో ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ క్రమంలో వార్ 2 చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 13వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇంకెన్ని కోట్లు వసూళ్లు చేయాలనే విషయానికొస్తే..
వార్ 2 బడ్జెట్ ఎంత?
హిందీలో టాప్ ఫిల్మ్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్ వార్ 2 చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అషుతోష్ రాణా, అనిల్ కపూర్ వంటి స్టార్ కాస్ట్ నటించడం విశేషం. దాంతో పాటు విదేశాల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించడం, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడంతో భారీగానే ఖర్చైంది. నటీనటులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార వ్యయం అన్ని కలిపి రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్?
భారీ తారగణం నటించడం, భారీ ప్రొడక్షన్ కంపెనీ వార్ 2 చిత్రాన్ని రూపొందించడంతో సినిమాపై సహజంగానే అంచనాలు నెలకున్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ రైట్స్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ రూ.105 కోట్లతో దక్కించుకున్నారు. ఇక కర్ణాటక+ ROI హక్కుల ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ.56 కోట్లు బిజినెస్ జరిగింది. నాన్ థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా రూ.160 కోట్ల వ్యాపారం అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వరల్డ్ వైడ్ గా వార్ 2 చిత్రానికి రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.
వార్ 2కి 12 రోజుల ఇండియా నెట్..
ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు, 10వ రోజు రూ.6.85 కోట్లు నెట్, 11వ రోజు రూ.7.25 కోట్లు, 12వ రోజు రూ.2.15 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 12 రోజుల్లో ఇండియా నెట్ రూ.225 కోట్లకు చేరుకుందని తెలిపారు.
13వ రోజు కలెక్షన్స్..
ఆగస్టు 26 మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ వార్ 2 చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. హిందీ, తమిళంలో 15 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. దీంతో హిందీ బెల్ట్ నుంచి రూ.2.50 కోట్ల నెట్, తెలుగు నుంచి రూ.50 లక్షలు నెట్ అందినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక తమిళంలో ప్రస్తుతం పెద్దగా వసూళ్లు కనిపించడం లేదు. దీంతో 13వ రోజు వార్ 2 చిత్రానికి రూ.3 కోట్ల ఇండియా నెట్, రూ.5 కోట్ల వరకు గ్రాస్ వసూలైందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. దీంతో 13వ రోజుతో కలిసి ఇండియా నెట్ రూ.228 కోట్లకు చేరుకుందని వెల్లడిస్తున్నారు.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
13వ రోజు వరకు వార్ 2 వరకు వార్ 2 చిత్రం వసూళ్లు ఇలా ఉన్నాయి. ఇండియా నెట్ రూ.228 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.274 కోట్లు, ఓవర్సీస్ రూ.76 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. దీంతో వార్ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని రూ.350 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక స్టేట్ వైజ్ వివరాలు చూస్తే.. హిందీలో రూ.171 కోట్లు, తెలుగులో రూ.55 కోట్లు, తమిళంలో రూ.2 కోట్లు వసూళ్లు చేసింది.
ఇంకెన్ని కోట్లు సాధించాలి?
ప్రస్తుతం ఈ చిత్రం రూ.350 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. 2 వారాలుగా ఈ చిత్రాలు సాధించిన వసూళ్ల మొత్తం ఇది. కాగా రూ.700 కోట్లు కలెక్ట్ చేస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఇంకా రూ.350 కోట్లు వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. తెలుగులో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











