War 2 Day 15 Collections: 2 వారాలు పూర్తి.. వార్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? ఇంకెన్ని కోట్లు రాబట్టాలి?

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2. బాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వరల్డ్ వైడ్ గా వసూళ్లను అందుకుంటోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 2 వారాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత? 15 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఇంకెన్ని కోట్లు వసూల్లు చేయాల్సి ఉందనే వివరాల్లోకి వెళితే..

వార్ 2 బడ్జెట్ ఎన్ని కోట్లు?
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ఫిల్మ్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం విశేషం. అలాగే విదేశాల్లో భారీ యుద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని సినిమాకు రూ.400 కోట్లు కలెక్ట్ అయినట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు.

War 2 Day 15 Box Office Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్?
వార్ 2 చిత్రం రిలీజ్ కు ముందే భారీ అంచనాలను కలిగి ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయ్యింది. తెలుగు స్టేట్స్ రైట్స్‌ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రూ.105 కోట్లకు సొంతం చేసుకున్నారు. కర్ణాటక+ ROI హక్కుల నుంచి రూ.19 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ.56 కోట్లు, నాన్ థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా రూ.160 కోట్ల బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా వార్ 2 సినిమాకు రూ.340 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

వార్ 2కి 14 రోజుల వసూళ్లు?
ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు, 10వ రోజు రూ.6.85 కోట్లు నెట్, 11వ రోజు రూ.7.25 కోట్లు, 12వ రోజు రూ.2.15 కోట్లు, 13వ రోజు రూ.2.75 కోట్లు, 14వ రోజు రూ.2.5 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలిపింది.

15వ రోజు వసూళ్లు?
ఆగస్టు 28తో ఈ చిత్రం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల వరకు ఈ చిత్రం కేవలం రూ.80 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సినిమాకు థియేటర్లలో ఫుల్ ఫాల్ భారీగా తగ్గించింది. ఓవరాల్ గా 13 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక మిగిలిన షోలు కలుపుకొని రూ.2 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
14 రోజుల్లో 2వ వారం పూర్తయ్యే సరికి ఇండియా నెట్ రూ.230 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.275 కోట్లు, ఓవర్సీస్ రూ.76.50 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో వార్ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని రూ.351 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. స్టేట్ వైజ్ వివరాలు చూస్తే.. హిందీలో రూ.172 కోట్లు, తెలుగులో రూ.56 కోట్లు, తమిళంలో రూ.2.10 కోట్లు వసూళ్లు చేసింది.

ఇంకెన్ని కోట్లు సాధించాలి?
ప్రస్తుతం ఈ చిత్రం రూ.350 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. 2 వారాలుగా ఈ చిత్రాలు సాధించిన వసూళ్ల మొత్తం ఇది. కాగా రూ.700 కోట్లు కలెక్ట్ చేస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఇంకా రూ.350 కోట్లు వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. తెలుగులో రూ.144 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X