War 2 Day 16 Collections: 3వ వీకెండ్ లో వార్ 2 కలెక్షన్ల పరిస్థితి.. 16వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరును తగ్గించింది. ప్రస్తుతం ఈ చిత్రం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2వ వారం కాస్తా మంచి వసూళ్లు అందుకున్న వార్ 2 చిత్రం మూడవ వారంలో పూర్తిగా వసూళ్లను కోల్పోయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఇలా ఉన్నాయి. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వరల్డ్ వైడ్ గా 16వ రోజు అందుకున్న వసూళ్లు ఎంతనే విషయానికొస్తే..

వార్ 2 బడ్జెట్ ఎన్ని కోట్లు?
హిందీలో టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న భారీ చిత్రం వార్ 2. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఆతుతోష్ రాణా వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం, అలాగే టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని రూ.400 కోట్లు కలెక్ట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

War 2 Day 16 Box Office Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత?
వార్ 2 మూవీ ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. దానికి తోడు టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ రూపొందించిన చిత్రం కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు స్టేట్స్ రైట్స్‌ ద్వారా రూ.105 కోట్లు, కర్ణాటక+ ROI హక్కుల ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ.56 కోట్లు, నాన్ థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా రూ.160 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇలా వరల్డ్ వైడ్ గా రూ.340 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

వార్ 2కి 15 రోజుల వసూళ్లు?
ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు, 10వ రోజు రూ.6.85 కోట్లు నెట్, 11వ రోజు రూ.7.25 కోట్లు, 12వ రోజు రూ.2.15 కోట్లు, 13వ రోజు రూ.2.75 కోట్లు, 14వ రోజు రూ.2.5 కోట్లు, 15వ రోజు రూ.1.5 కోట్లు నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

16వ రోజు వసూళ్లు?
ఈ చిత్రం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆగస్టు 29న శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు కేవలం రూ.28 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. ఇక మిగిలిన రెండు షోలకు సంబంధించిన వసూళ్లు కలిసినా ఈ చిత్రం రూ.1 కోటి వరకు ఇండియా నెట్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

15రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
3వ వారం ప్రారంభం 15 రోజుల్లో ఇండియా నెట్ రూ.232 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.278 కోట్లు, ఓవర్సీస్ రూ.76.50 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ పండింతులు తెలుపుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని రూ.354 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక స్టేట్ వైజ్ కలెక్షన్ల వివరాలకు వస్తే.. హిందీలో రూ.174 కోట్లు, తెలుగులో రూ.56 కోట్లు, తమిళంలో రూ.2.10 కోట్లు వసూళ్లు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X