War 2 Day 2 Box Office: రెండో రోజు వార్ 2 డామినేషన్.. ఎన్టీఆర్ తోడుగా హృతిక్ ఊచకోత.. ఎన్ని కోట్లంటే?

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన చిత్రం వార్ 2. వార్ మూవీకి సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా వార్ 2 చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో వార్ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.

వార్ 2 బడ్జెట్ ఎంత?
అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు వార్ 2 లో కీలకపాత్రలు పోషించారు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయం అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

War 2 Day 2 Expected Box Office Collections Worldwide Hrithik Roshan and Jr NTR s film heading towards 150 crores

వార్ 2 బిజినెస్ ఎంత?
వార్ 2 హిందీ వెర్షన్‌ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. దీంతో అక్కడ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)వెచ్చించి ఆంధ్రా, నైజాంలలో థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని వాల్యూ కట్టారు. వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వార్ 2 తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ దెబ్బకు వార్ 2పై గట్టి ప్రభావం పడింది. హిందీలో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు, ఇతర దక్షిణాది ప్రాంతాల్లో వార్ 2ను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. తొలి రోజు హిందీలో 30 కోట్ల రూపాయలు.. ఆంధ్రా, తెలంగాణలలో 25 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలలో కలిపి 5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో వార్ 2 చిత్రం 25 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దీంతో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వార్ 2 రెండో రోజు వసూళ్లు
ఆగస్ట్ 15 సెలవు దినం, వీకెండ్ కావడంతో వార్ 2కి రెండో రోజు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. హిందీతో పాటు తెలుగులో శుక్రవారం ప్రేక్షకులకు థియేటర్లకు ఎగబడుతున్నారు. నిన్న కూలీ మేనియా నడిచినప్పటికీ ఆగస్ట్ 15న మాత్రం వార్ 2 డామినేషన్ చూపిస్తోంది. రెండో రోజు సాయంత్రం 5 గంటల వరకు వార్ 2కి హిందీ వెర్షన్‌లో 43 శాతం, తమిళ్ వెర్షన్‌లో 51 శాతం, తెలుగు వెర్షన్‌లో 65 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. జూనియర్ ఎన్టీఆర్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఆక్యూపెన్సీ పెరుగుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

రెండో రోజు వార్ 2 చిత్రం హిందీలో 25 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున మొత్తంగా రెండో రోజు వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో కలిపి రెండ్రోజుల్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల చిత్రం ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ చేరుకుంటుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X