War 2 Day 8 Box Office: దారుణంగా పడిపోయిన వార్ 2 కలెక్షన్స్.. ఎన్టీఆర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా గతంలో హృతిక్ హీరోగా వచ్చిన వార్‌కి సీక్వెల్‌గా వార్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు వార్ 2 లో కీలకపాత్రలు పోషించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో వార్ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలివారం వార్ 2 సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది? 8వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.

వార్ 2 బడ్జెట్ ఎంత?
శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

War 2 Day 8 Expected Box Office Collections Worldwide Hrithik Roshan and Jr NTR s film witnessed biggest fall

వార్ 2 బిజినెస్ ఎంత?
వార్ 2 హిందీ వెర్షన్‌ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేసింది. దీంతో ఉత్తర భారతంలో ఈ సినిమాకు సుమారుగా 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా విలువ కట్టారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)వెచ్చించి తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ఓవరాల్‌గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని వాల్యూ కట్టారు. భారీ అంచనాల కారణంగా వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వార్ 2 తొలి వారం కలెక్షన్స్
వార్ 2 సినిమా భారతదేశంలో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 54 కోట్ల రూపాయలు, రెండో రోజు 60 కోట్ల రూపాయలు, మూడో రోజు 35 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 33 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల రూపాయలు, ఆరో రోజున 10 కోట్ల రూపాయలు, ఏడో రోజున 6.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వార్ 2 మూవీ ఇండియాలో తొలి వారం 202 కోట్ల రూపాయల నెట్, 240 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌‌లో వార్ 2 మూవీ 73 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తొలి వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌‌ల మూవీ వరల్డ్ వైడ్‌గా 313 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్
వార్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. తొలి రోజు 23 కోట్ల రూపాయలు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 8.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున కోటి 80 లక్షల రూపాయలు, 7వ రోజున కోటి 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు నైజాంలో 14 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.65 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.50 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వార్ 2 సినిమా తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో తొలి వారం వార్ 2 కలెక్షన్స్ చూస్తే .. కర్ణాటకలో 18 కోట్ల రూపాయలు, తెలుగులో 65 కోట్ల రూపాయలు, తమిళనాడులో 7 కోట్ల రూపాయలు, మలయాళంలో కోటి 75 లక్షల రూపాయలు, హిందీలో 148 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

వార్ 2 ఎనిమిదవ రోజు కలెక్షన్స్
వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి వార్ 2కి కలెక్షన్స్ పడిపోతున్నాయి. రూరల్ ఏరియాలలో బుకింగ్స్ డల్ అవుతుండగా.. అర్బన్ ఏరియాలలో ఓ మోస్తరుగా కలెక్షన్స్ వస్తున్నాయి. 8వ రోజు సాయంత్రం 8 గంటల వరకు హిందీలో 10 శాతం, తమిళంలో 16 శాతం, తెలుగులో 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. 8వ రోజు వార్ 2 చిత్రం హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, తమిళంలో 50 లక్షల రూపాయలు, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కలిపి మొత్తంగా 8 రోజుల వరకు వార్ 2 ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 47 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉండగా.. వరల్డ్ వైడ్‌గా 160 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వార్ 2కి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X