Hrithik Roshan: హృతిక్ రోషన్ కెరీర్‌లో టాప్ 5 ఓపెనింగ్స్.. War 2తో ఆ రికార్డ్‌పై గురిపెట్టిన హీరో!

హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. గతంలో బాక్సాఫీస్ హిట్లను అందించిన ఆయన తర్వాత ఎందుకో స్లో అయిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌‌తో వార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్‌ చిత్రాల్లో ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు పరిశీలిస్తే..

War 2 Hero Hrithik Roshan s top 5 openers in Indian Box Office Here s the details

వార్:
సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, అశుతోష్ రాణాలు కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 2, 2019న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 170 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వార్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 476 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు వార్ చిత్రం 53.35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. హృతిక్ రోషన్ కెరీర్‌లో అత్యథిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా వార్ నిలిచింది.

బాంగ్ బాంగ్:
సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన చిత్రం బాంగ్ బాంగ్. 2014 అక్టోబర్ 2వ తేదీ విడుదలైన ఈ సినిమా 140 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద 332.43 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ చిత్రం 27.54 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది.

క్రిష్ 3:
తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన చిత్రం క్రిష్ 3. క్రిష్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 1 నవంబర్ 2013న విడుదలైన ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద క్రిష్ 394 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. క్రిష్ 3 తొలిరోజు 25.50 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది.

అగ్నిపథ్:
కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన చిత్రం అగ్నిపథ్. ఈ సినిమాలో సంజయ్ దత్, రిషి కపూర్, ప్రియాంక చోప్రాలు కీలకపాత్రలు పోషించారు. 2012 జనవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను 58 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద అగ్నిపథ్ చిత్రం 193 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది.

సూపర్ 30:
విశాల్ బల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సూపర్ 30. నందిష్ సంధు, వీరేంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి, ఆదిత్య శ్రీవాస్తవ, అమిత్ సాద్‌లు కీలకపాత్ర పోషించారు. 2019 జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 209 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. తొలిరోజు సూపర్ 30 సినిమా 11.83 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది.

వార్ 2 తొలి రోజు కలెక్షన్స్ అంచనా
వార్ చిత్రం తొలి రోజు 53.35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో హృతిక్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దానిని వార్ 2 అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్, ఇతర ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఎన్టీఆర్- హృతిక్‌ల చిత్రం తొలి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X