War 2 Andhra, Nizam Business: నాగవంశీ చేతికి వార్2 థియేట్రికల్ రైట్స్.. రికార్డుతో బిజినెస్ ఎన్నికోట్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ.. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో, హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్‌ను పెంచింది.

బాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉన్న వార్ సినిమాకు సీక్వెల్ అనగానే అంచనాలు పెరిగాయి. ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగానే స్టార్ వాల్యూను యాడ్ చేశారు. ఈ సినిమాను స్పెయిన్, అబుదాబీ, రష్యా, జపాన్, ఇండియాలోని చాలా ముంబై, హైదరాబాద్‌లో షూట్ చేశారు. దాంతో ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా లాంటి యాక్టర్లు నటించారు.
ఇక ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్‌లో చిత్రీకరించారు. దాదాపు ఈ సినిమాను మూడు వారాలపాటు 33 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్ కలిపి మొత్తంగా 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తొలిసారి ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నేరుగా ప్రవేశించి వార్ 2 సినిమా చేస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా నైజాం, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ దక్కించుకొనేందుకు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్, నాగవంశీ లాంటి సంస్థలు భారీగా ప్రయత్నించాయి. కానీ ఈ ఛాన్స్‌ను చివరికి ఎన్టీఆర్ సహాయంతోనే కాకుండా కనివినీ ఎరుగని రేటును చెల్లించి నాగవంశీ దక్కించుకొన్నారు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సుమారుగా 90 కోట్లకు దక్కించుకొన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 112 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి ) అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తంలో బేరసారాల అనంతరం తగ్గితే 5 కోట్ల రూపాయలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ డీల్ జూలై 3న గానీ, లేదా జూలై 4న గానీ ఫైనల్ కానున్నట్టు విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











