War 2 Business: వార్ 2 రికార్డు బిజినెస్ వాల్యూ.. తెలుగు నిర్మాతలకు భంగపాటు.. చిక్కని ‘ఎన్టీఆర్’ మూవీ
హిందీలో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). 2019 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ సినిమాగా విజయం అందుకొన్న వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే..
500 కోట్ల రూపాయల బడ్జెట్
టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ హీరోలుగా వార్ చిత్రాన్ని సుమారుగా 170 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాంటి సీక్వెల్‌ను భారీగా నిర్మించారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా షబ్బీర్ అహ్లువాలియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వారీ అతిథి పాత్రల్లో మెరువనున్నారు. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో హై యాక్షన్ మూవీగా నిర్మించారు.

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ
ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా హృతిక్ నటిస్తుండగా.. విలన్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనేది తాజా సమాచారం. దాంతో అటు నార్త్‌లోను, ఇటు సౌత్‌లోను భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ తొలిసారి అసలు సిసలైన పాన్ ఇండియా మూవీతో వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగు నిర్మాతలకు భంగపాటు
అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకొనేందుకు సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ విశ్వ ప్రయత్నాలు చేశారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే యష్ రాజ్ ఫిలింస్ నేరుగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉత్సాహం చూపడంతో ఆంధ్రా, నైజాం థియేట్రికల్ బిజినెస్ మరోకరికి దక్కకుండా పోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. నాగవంశీ మాత్రమే కాకుండా దిల్ రాజుతోపాటు చాలా మంది నిర్మాతలు ఈ సినిమా కోసం ఫ్యాన్సీ రేటును ఆఫర్ ఇచ్చారు. అయినా యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిసింది.
తెలుగు రాష్ట్రాల వాల్యూ ఎంతంటే?
అయితే వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 120 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. అయితే ఇప్పటి వరకు హిందీ డబ్బింగ్ సినిమాకు ఇంత రేట్ ఎన్నడూ పలకలేదు. ఎన్టీఆర్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టి ఈ రేంజ్ బిజినెస్‌ను యష్ రాజ్ ఫిలింస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రజనీకాంత్‌తో పోటీ
వార్ 2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాతో పోటీ పడనున్నది. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. నార్త్‌లో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోయినా.. సౌత్‌లో మాత్రం భారీగానే కాంప్టిషన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











