War Total Collections: వార్ మూవీ టోటల్ కలెక్షన్లు.. వార్ 2తో ఎన్టీఆర్ ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం వార్. ప్రముఖ యువ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్, అశుతోష్ రానా కీలక పాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో రూపొందిన మూడో స్పై యూనివర్స్ చిత్రం. ఈ చిత్రం 2019 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోనే ఇంతకు ముందు నిర్మించిన చిత్రాల కంటే వార్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. భారీ తారాగాణంతోపాటు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, విశాల్ శేఖర్ సంగీతం, సంచిత్, అంకిత్ బెల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. ఆరీఫ్ షేక్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారు.

War Hindi Movie Total Collections

వార్ సినిమాకు సంబంధించిన యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా 6000 స్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా సుమారుగా 100 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగినట్టుగానే వార్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రోజున రిలీజై లాంగ్ వీకెండ్‌తో బాక్సాఫీస్‌ను రఫాడించింది. తొలి రోజు ఇండియాలోనే ఈ చిత్రం 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండోరోజు 24 కోట్ల రూపాయలు, మూడో రోజు 23 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 29 కోట్ల రూపాయలు, ఐదో రోజు 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 రోజుల తొలి వారాంతంలో 167 కోట్లకపైగా కలెక్షన్లను సాధించింది.

వార్ చిత్రం తొలివారం ముగిసే సమయానికి 238 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ సుమారుగా 229 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తెలుగు వెర్షన్ 7 కోట్లకుపైగా కలెక్షన్లు, తమిళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాదాపు ఆరు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం మొత్తంగా ఇండియాలో 320 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. హిందీలో 320 కోట్ల రూపాయలు, తెలుగులో 11 కోట్ల రూపాయలు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వార్ చిత్రం ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కెరీర్‌లో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఘనతను సాధించింది. ఓవర్సీస్‌లో 96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 320 కోట్ల నెట్, 375 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 471 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 2019 సంవత్సరంలో అత్యధికంగా కలెక్షన్లను రాబట్టిన బాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక వార్ సినిమాకు ఫ్ఱాంచైజీగా వస్తున్న వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హిందీ రంగ ప్రవేశం చేస్తున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు. వార్ సినిమాతో పోల్చుకొంటే ఈ సినిమా తెలుగులోనే రికార్డు కలెక్షన్లతో ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. వార్‌ను మించి వసూళ్లను సాధిస్తుందనే చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X