Don't Miss!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- News మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, మాజీ సీఎం మాస్ వార్నింగ్, నా గురించి తెలుసు కదా !
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Automobiles పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- Sports IPL 2024: ఆర్సీబీ కొంపముంచుతున్న ఫాఫ్ డుప్లెసిస్ చెత్త కెప్టెన్సీ!
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
300 కోట్లు కొల్లగొట్టిన వార్.. కబీర్ సింగ్ రికార్డులు బ్రేక్
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. ఈ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించినా వసూళ్ల దూకుడును తగ్గించలేదు. ఇప్పటికే 291 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ చిత్రం ఆదివారం కల్లా రూ.300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
వార్ చిత్రం శుక్రవారం హిందీ వెర్షన్‌కు రూ.2.8 కోట్లు, తమిళ, తెలుగు భాషల్లో రూ.25 లక్షలు సాధించింది. మూడో శనివారం రోజున భారీగా వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌కు మాత్రమే రూ.4.7 కోట్లు రాబట్టడం విశేషం. బాలీవుడ్లో ఈ చిత్రానికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నది. ఓవరాల్‌గా 18వ రోజున రూ.295.75 కోట్లు వసూలు చేసింది.
రెండోవారంలో శుక్రవారం రూ.7.1 కోట్లు, శనివారం రూ.11.2 కోట్లు, ఆదివారం రూ.13.2 కోట్లు, సోమవారం రూ.4.4 కోట్లు, మంగళవారం రూ.3.9 కోట్లు, బుధవారం రూ.3.35 కోట్లు, గురువారం రూ.3.5 కోట్లు, శుక్రవారం రూ.2.5 కోట్లు సాధించింది.
వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. 300 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ. తొలివారం రూ.238 కోట్లు, రెండోవారం రూ.49 కోట్లు సాధించింది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కబీర్ సింగ్ వసూళ్లను అధిగమించిన ఈ చిత్రం ధూమ్ 3 సినిమా రికార్డులపై కన్నేసింది.
ఇక వచ్చేవారం వార్ సినిమాకు గట్టిపోటి ఎదురయ్యే అవకాశం ఉంది. సాండ్ కీ ఆంఖ్, మేడ్ ఇన్ చైనా చిత్రాలు రిలీజ్ కానున్నది. అలాగేహౌస్ఫుల్ 4 చిత్రం కూడా ఈ సినిమాకు ఎదురు నిలిచే అవకాశం ఉంది.