For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

300 కోట్లు కొల్లగొట్టిన వార్.. కబీర్ సింగ్ రికార్డులు బ్రేక్

|

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. ఈ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించినా వసూళ్ల దూకుడును తగ్గించలేదు. ఇప్పటికే 291 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ చిత్రం ఆదివారం కల్లా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

వార్ చిత్రం శుక్రవారం హిందీ వెర్షన్‌కు రూ.2.8 కోట్లు, తమిళ, తెలుగు భాషల్లో రూ.25 లక్షలు సాధించింది. మూడో శనివారం రోజున భారీగా వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌కు మాత్రమే రూ.4.7 కోట్లు రాబట్టడం విశేషం. బాలీవుడ్‌లో ఈ చిత్రానికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నది. ఓవరాల్‌గా 18వ రోజున రూ.295.75 కోట్లు వసూలు చేసింది.

 War movie 18 days collections: Heading 300 crores club

రెండోవారంలో శుక్రవారం రూ.7.1 కోట్లు, శనివారం రూ.11.2 కోట్లు, ఆదివారం రూ.13.2 కోట్లు, సోమవారం రూ.4.4 కోట్లు, మంగళవారం రూ.3.9 కోట్లు, బుధవారం రూ.3.35 కోట్లు, గురువారం రూ.3.5 కోట్లు, శుక్రవారం రూ.2.5 కోట్లు సాధించింది.

వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. 300 కోట్ల క్లబ్‌లో చేరడం గ్యారెంటీ. తొలివారం రూ.238 కోట్లు, రెండోవారం రూ.49 కోట్లు సాధించింది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కబీర్ సింగ్ వసూళ్లను అధిగమించిన ఈ చిత్రం ధూమ్ 3 సినిమా రికార్డులపై కన్నేసింది.

ఇక వచ్చేవారం వార్ సినిమాకు గట్టిపోటి ఎదురయ్యే అవకాశం ఉంది. సాండ్ కీ ఆంఖ్, మేడ్ ఇన్ చైనా చిత్రాలు రిలీజ్ కానున్నది. అలాగేహౌస్‌ఫుల్ 4 చిత్రం కూడా ఈ సినిమాకు ఎదురు నిలిచే అవకాశం ఉంది.

English summary
Bollywood heroes Hrithik Roshan and Tiger Shroff is combined for a Multi starrer movie War. This movie War movie day 18 collections was at 2.8 crores above. This movie collected nearly Rs.295 crores collections.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more