twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిస్ట్రిబ్యూటర్ గా దారుణంగా నష్టపోయిన వరంగల్ శ్రీను.. 2022 సినిమాలతో కోలుకోలేని దెబ్బ!

    |

    డిస్ట్రిబ్యూటర్ గా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టమైన పని. కేవలం కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో సక్సెస్ అవుతున్నాయి. ఇక చాలా వరకు పంపిణీదారులు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో అయితే కొనసాగడం లేదు. ఇక ఇక్కడ లాభాలు అందుకున్న వారి కంట నష్టాలతో చాలా డబ్బును కోల్పోయిన వారే ఎక్కువ. ఇటీవల వరంగల్ శ్రీను కూడా వరుసగా దారుణమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతనికి 2022లో వరుసగా విడుదల చేసిన సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.

    విజయ్ దేవరకొండ లైగర్ సౌత్ ఇండియా కు సంబంధించిన రిలీజ్ హక్కులను అతను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ సినిమా దాదాపు 51 కోట్ల వరకు నష్టాలు కలిగించినట్లు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ సినిమా నైజాం హక్కులు భారీ ధరకు అందుకోగా నైజాం ఏరియాలోనే 25.5 కోట్లకు పైగా నష్టాలను కలిగించింది. మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు చిన్న సినిమాలు కూడా వరంగల్ శ్రీనుకు ఊహించని విధంగా దెబ్బకొట్టాయి.

    Warangal srinu unexpected losses with 2022 tollywood movies

    ఇక విశాల్ నటించిన సామాన్యుడు సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులు కొనుగోలు చేయగా ఆ సినిమా 4 కోట్లకు వరకు నష్టాలను కలుగజేసింది. ఇక రానా సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా ఏపీ తెలంగాణ లో 8.5 కోట్ల వరకు నష్టాలు కలుగజేశాయి. ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ హక్కులను కూడా అతను భారీ ధరకే కొనుగోలు చేయగా ఆ సినిమా 10.7 కోట్ల వరకు నష్టాలు తెప్పించింది.

    ఇక శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా అతనికి 8 కోట్ల వరకు నష్టాలు కలుగజేసింది. ఈ విధంగా అతను ఈ ఏడాది వరుసగా డిస్ట్రిబ్యూటర్ గా 100 కోట్లకు పైగా నష్టాలు ఎదుర్కొన్నట్లు సమాచారం. అయితే అతనికి కేవలం ఒక కన్నడ డబ్బింగ్ సినిమా విక్రాంత్ రోణా మాత్రమే పెట్టిన పెట్టుబడికి కొంత ఎక్కువ లాభాలను అందించింది. కానీ అదేమి పెద్ద అమౌంట్ కాదు. కానీ భారీ పెట్టబడి పెట్టిన సినిమాలే అతన్ని దారుణంగా దెబ్బకొట్టాయి.

    English summary
    Warangal srinu unexpected losses with 2022 tollywood movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X