twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతటా ధియోటర్స్ ఖాళీ(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Naa Girlfriend Baaga Rich
    ఈ వారం కూడా పూర్తి నిరాశలో ముంచుతూ శివాజి నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఒక్కటే రిలీజైంది. హాలీవుడ్ బ్లాక్ సెటైర్ చిత్రం 8 హెడ్స్ ఇన్ డఫెల్ బ్యాగ్ అనే చిత్రం కాపీగా ఈ సినిమా వచ్చింది. కామిడీ చిత్రం గా వచ్చిన ఈ సినిమా అందరినీ ఏడ్పించింది. ఇక అంతకుముందు వారం వచ్చిన రస్నాబేబి అంకిత సునామీ ఎక్స్ చిత్రం పెద్ద ఫ్లాఫ్ గా మిగిలింది. నిన్న(గురువారం) వచ్చిన మేస్త్రి కూడా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయింది. సినిమాలో చిరంజీవి పై పూర్తి స్ధాయి సెటైర్స్ ఉన్నాయిని మీడియాలో ప్రచారం కావటం కొంతవరకూ ఈ చిత్రానికి ఊరట. వీటిన్నటి ఎఫెక్టుతో అరుంధతి చిత్రమే ఈ వారం కూడా టాప్ స్లాట్ లో ఉంది. అయినా మేస్త్రిలో చెప్పినట్లు మార్నింగ్ షో టైమ్ కి ఒక హీరో, మాట్నీ టైమ్ కి మరో హీరో, ఈవినింగ్ మరొకరు రోడ్ షోల్లో ప్రత్యక్ష్యంగా కనపడుతూంటే ధియోటర్స్ కి జనం వెళ్ళి చూడాలనిపిస్తుందా. మరో ప్రక్క కొత్త సినిమాలు కూడా ప్రారంభం కావటం లేదు. ఇవన్నీ చూస్తూంటే ఆర్ధికమాంధ్యం తో పాటు ఎలక్షన్స్ ఎఫెక్టు కూడా పూర్తిగా పడినట్లుంది. కొద్ది నెలలు ముందకెళితే గానీ పరిశ్రమ కుదుటపడేటట్లు లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X