ఆ ఐదు సినిమాల్లో ఏది హిట్టంటే..(ట్రేడ్ టాక్)
క్రితం వారం ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో మూడు స్ట్రైయిట్ చిత్రాలు కాగా,రెండు అనువాద చిత్రాలు. స్ట్రైయిట్ చిత్రాల విషయానికి వస్తే..శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్ లో వచ్చిన అఆఇఈ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కామిడీ అని భ్రమపడి వెళ్ళిన వారికి విచిత్రమైన కథా, కథనంతో ఏడుపుతెప్పిస్తోంది. బి, సి సెంటర్లు మీద ఆశ పెట్టుకున్న ఈ చిత్రానికి అక్కడా కలెక్షన్స్ కరువు అయ్యాయి.
ఇక సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో వినాయకుడు సీక్వెల్..విలేజ్ లో వినాయకుడు వచ్చింది. అయితే అతి స్లోగా నేరేషన్ ఉండటం,కథ,కథనాలపై శ్రధ్ద పెట్టకపోవటం సినిమాను నాశనం చేసాయి. మల్టీఫ్లెక్స ఆడియన్స్ టార్గెట్ చేసిన ఈ చిత్రం వారు ఆవలింతలు మిగులుస్తోంది. దాంతో సాయి కిరణ్ అడవి దర్శకుడుగా రెండో చిత్ర గండం తప్పించుకోలేకపోయాడని అంతటా వినపడుతోంది.
వీటికి తోడు ఏడు కొండలవాడా..వెంకటరమణా..అందరూ బాగుండాలి చిత్రం కూడా రిలీజైంది. రైతుల సమస్యలు అంటూ వ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నవనీత్ కౌర్ గ్లామర్ గానీ, సునీల్ కామిడీ కానీ వర్కవుట్ కాలేదు.
ఇదిలా ఉంటే అనువాద చిత్రాలు పదమూడు ..హిందీ,తమిళంలో బాగానే ఆడినా తెలుగులో ఎవరినీ ఆకట్టుకోలేక చతికలపడింది. పబ్లిసిటీ సరిగ్గా లేకపోవటమే ఈ చిత్ర పరాజయానికి కారణం అంటున్నారు. ఎ సెంటర్స్ వారందరూ దరిదాపు ఈ చిత్రాన్ని చూసారని, బి, సి సెంటర్లే బ్యాలన్స్ ఉన్నాయని అయితే అక్కడకు తీసుకెళ్ళే ప్రమోషనే సరిగ్గా జరగటం లేదని తెలుస్తోంది. వీటికి తోడు నయనతార గ్లామర్ ని క్యాష్ చేసుకుందామని వచ్చిన మల్లికా ఐ లవ్ యూ కూడా కలెక్షన్స్ లేక వెలాతెలా పోతోంది. అదీ ఈ వారం ట్రేడ్ టాక్.


Click it and Unblock the Notifications











