బ్యాడ్ టైమ్ (ట్రేడ్ టాక్)
క్రిందటి వారం 'గజిబిజి' అనే ఒక కామెడి సినిమా మాత్రమే రిలీజయైంది. సీనియర్ రచయిత సత్యానంద్ కథ అందించిన ఈ చిత్రానికి కె.వాసు దర్శకత్వం వహించారు. ఎంచుకున్న పాయింట్ కామిడీగా ఉన్నా టైటిల్ కి తగ్గట్లే పాత్రల మధ్య గజిబిజి ఎక్కువై అసహనం మిగులుస్తోంది.
ఇక రజనీకాంత్ ప్రధాన పాత్రలో జగపతిబాబు నటించిన కధానాయుకుడు ,శివాజీ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఆలయం చిత్రాలు రెండూ పూర్తి స్ధాయి ఫ్లాప్ ని నమోదు చేసాయి. అయితే రజనీకాంత్ చిత్రం ఎలా ఉన్నా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఆలయం మాత్రం నిర్మానుష్యంగా మారిన థియోటర్స్ తో డీలాగా మిగిలింది.
ఇక అంతకు ముందు వారం రిలీజైన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. మా ఆయన చంటి పిల్లాడు,ఇట్లు నీ వెన్నెల,కృషి చిత్రాల జాడే లేదు. ఇక కళ్యాణ రామ్ హరే రామ్ సిటీల్లో వారాంతరాల్లో బి.సి సెంటర్లలకు ఫస్ట్ షో,సెకెండ్ షోలు హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్టు. అలాగే రెడీ,దశావతారం తమ స్ధానాల్ని చెక్కుచెదరనీయకుండా కలెక్షన్లు ను సంపాదించుకుంటున్నాయి.
ఇక నిన్న రిలీజైన రవితేజ బలాదూర్ పాత సీసాలో పాత సారాలా ఉండటంతో కష్టం అనే టాక్ వచ్చింది. విశాల్ హీరోగా చేసిన సెల్యూట్ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో ఉన్నా లెంగ్త్ ఎక్కువవటం సమస్యగా ఉందని...తగ్గిస్తే హిట్ కు ఢోకా ఉండదంటున్నారు.


Click it and Unblock the Notifications











