విధ్వంసం సృష్టిస్తున్న 2.0.. కథ ముగిసింది అనుకుంటే.. బాక్సాఫీస్ రిపోర్ట్!

సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0. గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారత సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఇండియన్ సినిమాకు గర్వకారణం అంటూ కూడా ప్రశంసలు వచ్చాయి. తొలి రోజు ఈ చిత్ర వసూళ్లు నెమ్మదిగా ఆరంభం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శంకర్, రజని క్రేజీ కాంబినేషన్ లో రూపొందింన చిత్రం కావడంతో కళ్ళు చెదిరే వసూళ్లు నమోదవుతాయని అంచనా వేశారు. హిందీ వర్షన్ లో ఈ చిత్ర నాలుగురోజుల వసూళ్లు వివరాలని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

నిరాశాజనకంగా

నిరాశాజనకంగా

ఈ చిత్రం గురువారం విడుదల కావడంతో ఆ ప్రభావం కూడా పడింది. ముఖ్యంగా తమిళనాడులో నమోదైన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. కేవలం రెండు రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం 27 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ హిందీ వర్షన్ నుంచి మాత్రం సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Recommended Video

Rajinikanth's 2.0 First USA Weekend Collections | Filmibeat Telugu
కథ ముగిసింది అనుకున్నారు

కథ ముగిసింది అనుకున్నారు

2.0 చిత్రానికి 370 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలి రోజు వసూళ్లు చాలా తక్కువగా నమోదు కావడంతో శంకర్ సినిమా కథ ముగిసిందని అంతా భావించారు. కానీ తెలుగు, హిందీ, యుఎస్ మార్కెట్ నుంచి 2.0 కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో ఆశలు చిగురించాయి. యూఎస్ లో ఒక్కొరికార్డుని అధికమిస్తూ 2.0 డాలర్ల వర్షం కురిపిస్తోంది. హిందీలో అయితే ఆశ్చర్యకరంగా రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని తరుణ్ ఆదర్శ్ వివరిస్తూ 2.0 నాలుగురోజుల వసూళ్లు వెల్లడించారు.

వీకెండ్‌లో విధ్వంసం

వీకెండ్‌లో విధ్వంసం

2.0 హిందీ వర్షన్ ఒకరకంగా వీకెండ్ లో విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. తొలిరోజు పరవాలేదనిపించేలా ఈ చిత్రం హిందీలో 20 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత శుక్రవారం రోజు వసూళ్లు కాస్త తగ్గుతూ 19 కోట్లుగా నమోదైంది. అత్యంత కీలకమైన శని, ఆదివారాల్లో 2.0 చిత్రం అద్భుతం చేసిందని చెప్పొచ్చు. శనివారం రోజు ఈ చిత్రం 24 కోట్లు రాబట్టగా ఆదివారం రికార్డు స్థాయిలో 34 కోట్లు వసూలు చేసింది. దీనితో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. ఇక సోమవారం 2.0 చిత్రానికి అత్యంత కీలకం కానుంది. ఈ చిత్ర విజయం సోమవారం నమోదయ్యే వసూళ్లపైనే ఆధారపడి ఉంటుంది.

 కేవలం హిందీలోనే

కేవలం హిందీలోనే

తొలి నాలుగు రోజుల్లో 2.0 చిత్రం హిందీ వర్షన్ వసూళ్లు 95 కోట్లుగా నమోదయ్యాయి. దీనితో 2. 0 చిత్రం కేవలం హిందీ వర్షన్ లో మాత్రమే సోమవారం 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఈ ఏడాది 100 కోట్ల క్లబ్ లో చేరిన హిందీ చిత్రాలలో 12వదిగా 2.0 రికార్డు సృష్టించనున్నట్లు ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X